అధిక కొలెస్ట్రాల్​ సైలెంట్ కిల్లర్, లక్షణాలు - ఈ ఆహారం ఎంతో ప్రయోజనం..!!

అధిక కొలెస్ట్రాల్. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఎన్నో ప్రాణాంతక రుగ్మతలకు కారణం. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పటికీ అంత తొందరగా మనకు అర్థం కాదు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే గుండె తో పాటుగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో కనిపించే లక్షణాలే అధిక కొలెస్ట్రాల్ కు సూచికలు. అయితే, ఈ సమస్య పరిష్కారం మన చేతులలోనే ఉంది. మనం తీసుకునే ఆహారం.. జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకొనే అవకాశం ఉంది.

రక్తంలో కొలెస్ట్రాల్ అనే మైనపు లాంటి పదార్థం. శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కణాలను నిర్మించడానికి, విటమిన్ డి, హార్మోన్లను తయారు చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి హానికరం. అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో ప్లాక్ ఏర్పడి గుండె జబ్బులకు, స్ట్రోక్​ కు కారణంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉంటే సహజంగా ఛాతీ నొప్పి, కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి, చర్మ మార్పులు, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు, గుండె స్పందనలో మార్పు, దవడలో నొప్పి,మెడ వెనుక భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 2 డయా బెటిస్, ఒబెసిటీ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి.

what-is-the-first-noticeable-symptom-of-cholesterol-how-to-reduce

తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అధిక మద్యం సేవించడం వంటి కారకాలు కూడా అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపారు. అయితే, దీనిని నియంత్రణలో ఉంచటానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. వాల్నట్స్ ను ప్రతిరోజూ అల్పాహారంగా తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదం, వేరుశనగ వంటివి క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రోజుకు 2 ఔన్సుల గింజలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్​ 5 శాతం వరకు తగ్గించుకోవచ్చు. అవిస గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఉదయం నడక లేదా వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆహారం.. జీవన శైలిలో మార్పులతో అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించ వచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+