ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే కార్తీకమాసం: ఈ నెలకు మరో పేరు ఏంటో తెలుసా..?

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీకమాసం మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతోంది. పురాణాల్లో ఈ మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. శివకేశవులకు అత్యంత ప్రీతకరమైన మాసంగా భావిస్తారు. అధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నెల ఇది. ఈ నెల 4వ తేదీన దీపావళి పండుగ మరుసటి రోజు నుంచే ఈ విశిష్ట మాసం మొదలవుతుంది. మళ్లీ అమావాస్య వరకు కొనసాగుతుంది. ఈ నెలలో ప్రతి సోమవారం శైవక్షేత్రాలను సందర్శించడానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు.

ఆధ్యాత్మిక వాతావరణం..

ఆధ్యాత్మిక వాతావరణం..

ప్రతి సోమవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దీపారాధనలతో విరాజిల్లుతుంటాయి. ఈ నెల పొడవునా ఒకరకమైన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తుంటుంది. దీప కాంతులతో శైవ, వైష్ణవాలయాలు ధగధగమంటూ వెలిగిపోతుంటాయి. ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతుంటాయి. నదీ స్నానాలు, జపతాపాలు, గ్రామాల్లో తెల్లవారు జామునే వినిపించే భక్తి గీతాలు, ఘంటా నాదాలతో ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతుంటుంది ఈ కార్తీకమాసం. ఓ పాజిటివ్ వైబ్రేషన్స్‌ను కలిగిస్తుంది.

 శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనదిగా..

శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనదిగా..

ఇక కార్తీక మాసం చివరి సోమవారం శైవక్షేత్రాలు ఏ స్థాయిలో పోటెత్తుతుంటాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఈ నెలకు అంతటి పవిత్రతను చేకూరడానికి కారణం ఉంది. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో చేసే పూజలకు ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో చేసే ఆరాధన మనల్ని పాపం నుండి విముక్తులను చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముక్తి మార్గంలో నడిపిస్తుందని స్పష్టం చేస్తోన్నాయి.

నదీస్నానం.. పుణ్యఫలం

నదీస్నానం.. పుణ్యఫలం

కార్తీక మాసంలో చన్నీళ్ల స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. నదీ స్నానానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. అందుకే- ప్రతి సోమవారం కూడా గంగానదీమతల్లిలో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరిస్తుంటారు. చాలామంది శ్రీకృష్ణుడిని దీపాలు వెలిగించి పూజిస్తారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కార్తీక పూర్ణిమ నాడు మత్స్యావతారాన్ని ధరించినట్లు విశ్వసిస్తారు.

 మాంసాహారానికి దూరం..

మాంసాహారానికి దూరం..

ఈ నెలలో ఉపవాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి సోమవారం భక్తులు ఉపవాసం ఉంటారు. నోములను నోచుకుంటారు. కార్తీక మాసంలో మాంసాహారం నిషేధం. దీన్ని భుజించడాన్ని పూర్తిగా మానేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ మతంలో తులసి పవిత్రమైనదిగా పరిగస్తారు. కార్తీక మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో ఒక నెల పాటు నిరంతరం తులసి ముందు దీపం వెలిగించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తులసిని పూజిస్తే అకాల మరణాన్ని నివారించినట్టవుతుందని విశ్వాసం.

నెలపొడవునా దీపారాధన..

నెలపొడవునా దీపారాధన..

నదీమ తల్లికీ పూజలు చేస్తారు భక్తులు. దీపాలను వెలిగించి గలగలమంటూ పారే నదిలో విడుస్తుంటారు. దీపం కాంతిపుంజం. చీకట్లను తొలగించే కాంతిపుంజం. చీకటిని ఏరకంగా ఈ దీపకాంతులు పారద్రోలుతాయో.. అదే రకంగా అజ్ఞానాన్ని, అశాంతిని తొలగిస్తాయి. మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నిత్య దీపారాధన చేయడం ఒక ఎత్తయితే.. కార్తీక మాసం చేసే దీపారాధన మరో ఎత్తుగా భావిస్తుంటారు భక్తులు.

 పురుషోత్తమ మాసంగా..

పురుషోత్తమ మాసంగా..

కార్తీక మాసాన్ని పురుషోత్తమ మాసంగా జరుపుకొంటారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు కేశవుడిని పూజిస్తారు. శ్రీమహావిష్ణువు సహస్త్ర నామానాలను జపిస్తుంటారు. వైష్ణవాలయాలు విష్ణు సహస్రనామాలతో మారుమోగుతుంటాయి. శ్రీమన్నారాయణుడి సేవలో భక్తులు తరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+