వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయకుడి జననం ఎలా జరిగింది.. వినాయక చవితి చరిత్ర ఏంటి..?

|
Google Oneindia TeluguNews

గణేశ చతుర్థి

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గౌరీ గణేశ పార్వతీ దేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయంతో గణేషుడిని సృష్టించి ఆ రోజును గణేశుని పుట్టినరోజుగా భావించారు. ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని పిలువబడుతోంది.

గణేశ చతుర్థి:- సిరి సంపదలు సమృద్ధిగా, జ్ఞానం, గొప్పతనం, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించేది గణేశుడు. హిందూ పంచాగం ప్రకారం పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. అన్నివేళలా కరుణ కలిగి ఎల్లప్పుడు ఆశీస్సులను ప్రసాధించే గణేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు చతుర్థిని జరుపుకుంటారు.

How was Lord Ganesh born, what is the history of Ganesh Chathurthi

ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం ఒక రోజు, మూడు రోజులు, ఏడు రోజులు, పది రోజులు జరుపుకుంటారు. కొంతమంది గౌరీ, గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు, మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తారు.

పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ, సరస్వతిని గణేశుడులను సోదరీ మణులుగా పూజిస్తారు. వారు దుర్గాదేవి పిల్లలుగా భావిస్తారు. కొందరు లక్ష్మీ, సరస్వతి గణేశుల ఇద్దరు భార్యలు. సిద్ధి, బుద్ధి. ఇది బిన్న అభిప్రాయాలకు కారణమని చెప్పవచ్చు. ఎదిఎమైననూ.. ఈ పండుగను గౌరీ గణేష పండుగగా పిలువబడుతున్నది.

పురాణం గాథ:- పురాణాల ప్రకారం ఒక రోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు, ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతి దేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చొండి బెట్టి స్నానానికి వెల్లాని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది.

అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది. విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆ విగ్రహమూర్తికి గణేశ అని పేరు పెట్టింది. తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించింది. ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను. ఎవరినీ లోపలికి రానివ్వకండి అని చెబుతుంది.

అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడుతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు. లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్ళడానికి అనుమంతించకుండా ఆపుతాడు. శివుడు పార్వతి దేవి పతిదేవుడనే విషయం గణేశుడికి, గణేశుడు పార్వతి దేవి సృష్టించి కుమారుడని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేశుడిపై ఆ పరమేశ్వరుడు ఆగ్రహావేశాలకు గురయ్యై అతడి తలను నరికివేస్తాడు.

బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు. భటులు ఉత్తర దిక్కున్న పడుకున్న వ్యక్తి తల కోసం వేతుకుతారు. అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. శివ శిశువు మీద ఏనుగు తలను స్థిరపెట్టి, అతనికి తిరిగి జీవం పోస్తాడు.

గౌరీ చతుర్థి ఆచారం :- మహిళలు చతుర్థికి ముందు రోజు ఈ దేవిని పూజించడం ఆచారంగా వస్తోంది. అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచడం జరగుతుంది. పూలు, పండ్లు సమర్పించి పూజిస్తారు. మరుసటి రోజు గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.

English summary
Godess Parvathi have created Lord Ganesha out of turmeric paste and that is celebrated as Ganesh Chathurthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X