మెదడువాపు వ్యాధి వస్తుంది
"నేను రోజుకు తొమ్మిది, పది కవితలు రాసి పారేస్తాను తెలుసా" అన్నాడు తెలుగు కవి ఒకతను
"అలా రాసి పారేస్తే చాలా మంచిది" అన్నాడు మిత్రుడు
"ఎందుకు?" అడిగాడు కవి
"వాటిని పత్రికలు పంపితే అవి చదివినవారికి మెదడువాపు వ్యాధి వస్తుంది. రాసి పారేస్తే ఆ సమస్య ఉండదు కదా" అన్నాడు అమాయకంగా మిత్రుడు
...... .......
"ఏమిటి వదినా! మీ ఆయన ఏమిటేమిటో మాట్లాడేస్తున్నాడు. ఒక్క ముక్క కూడా అర్థమై చావడం లేదు. ఒక మాటకు మరో మాటకు పొంతన ఉండడం లేదు. ఏమైనా అయిందేమిటి, వదినా!!" అన్నది సీతమ్మ పక్కింటి మాణిక్యమ్మతో.
"ఏమీ లేదు వదినా! ఆయన ఈ మధ్య కవిత్వం రాయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇదే వరుస. భరించలేక చస్తున్నాను అనుకో" అంది మాణిక్యమ్మ.












Click it and Unblock the Notifications