సూర్యగోళం మీద కాలు పెడతాం
ఓ రష్యన్, అమెరికన్ మన తింగరిరావు కి ప్లైట్ లో కలిసారు..
మొదటిగా రష్యన్ మాట్లాడుతూ... "తొలిసారిగా అంతరిక్షంలో కాలు పెట్టింది మేమే..." చెప్పాడు గర్వంగా...
వెంటనే అమెరికన్ మరింత ఉత్సాహంతో... "చంద్రుడు మీద తొలిసారిగా కాలు పెట్టింది మేమే" అన్నాడు
మన తింగరి రావు వెంటనే... "సూర్యుడు మీద తొలిసారిగా కాలు పెట్టబోయేది మేమే..." అన్నాడు..
"సూర్య గోళం మీదకు ఎవరూ వెళ్లలేరు. కాలి మసైపోతారు" చెప్పారు ఇద్దరూ..కూల్ గా...
"మేమైమైనా తెలివి తక్కువ వాళ్లం అనుకుంటున్నావా...అక్కడికి రాత్రిళ్లు వెళతాం" అన్నాడు తింగరి రావు మరింత కూల్ గా..
------------------------
ఓ సారి తింగరి రావు తన ప్రెండ్ తో కలిసి అడవికి వెళ్లాడు.
అక్కడ ప్రెండ్ ఓ సింహంపై చేతి దురదతో ఓ రాయి విసిరాడు. దానికి తగలటంతో అది పెద్దగా అరుస్తూ మీదకి రాసాగింది.
"చెట్టెక్కు త్వరగా" చెప్పాడు ప్రెండ్...తింగరిరావుతో..
"నేనెందుకు ఎక్కాలి..విసిరింది నువ్వేగా...అది నిన్నే తినేస్తుంది" మొండిగా అన్నాడు ...