వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీక మాసంలో ఈ పనులు చెయ్యండి.. లక్ష్మీ కటాక్షంతో పాటు బోలెడు ఫలితాలు!!

|
Google Oneindia TeluguNews

అన్ని మాసాలలో కార్తీకమాసానికి విశిష్టత వుంటుందని చెబుతారు. కార్తీక మాసంలో నిత్యం నిష్టతో శివకేశవులకు పూజలు చేస్తే సకల పాపాలు తొలగి పోతాయని, విశేషమైన ఫలితాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కార్తీకమాసంలో పనులు చేయడంవల్ల జీవితంలో తిరుగే ఉండదని, వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇక అన్నిటి కంటే పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే

కార్తీక మాసంలో కార్తీక స్నానాలతో మంచి ఫలితాలు

కార్తీక మాసంలో కార్తీక స్నానాలతో మంచి ఫలితాలు


కార్తీకమాసంలో తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానాన్ని ఆచరించాలి. అలా కార్తీక స్నానం ఆచరించడం వల్ల మన అంతఃకరణ శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నదులలో, సముద్రాలలో స్నానం చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. తెల్లవారుజామునే లేచి మనసులో భగవంతుని సంకల్పించుకుని స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెపుతున్నారు. జలం దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం కావడంతో, అటువంటి జలంతో స్నానం ఆచరించి భక్తితో భగవంతుని పూజించాలని చెబుతారు.

కార్తీక దేవతారాధనతో కలుగును పుణ్య ఫలం

కార్తీక దేవతారాధనతో కలుగును పుణ్య ఫలం


ఇక ఆ తర్వాత కార్తీకమాసంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని స్నానానంతరం దేవతారాధన చేయడం. కార్తీక మాసంలో ప్రతిరోజూ దేనికదే ప్రత్యేకం. కార్తీకమాసంలో ఉన్న విశిష్టమైన రోజులను బట్టి, ఆయా రోజులకు అనుగుణంగా పూజలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తీకమాసంలో శివారాధన చేసినవారికి శివసాయుజ్యం లభిస్తుందని, విష్ణువును పూజించిన వారికి విష్ణు సాయుజ్యం దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే కార్తీకమాసంలో సోమవారం నాడు శివారాధన, శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజున విష్ణుమూర్తి పూజ, కార్తీక శనివారాలలో దుర్గా దేవి ఆరాధన చేయడం మంచిదని, తద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

కార్తీక దీపారాధనతో సత్ఫలితం

కార్తీక దీపారాధనతో సత్ఫలితం

కార్తీకమాసంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధన కు చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. ప్రతి రోజు దీపారాధన చేయడం పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన, ఆలయాలలో గాని, గోశాలలో గాని, తులసికోట వద్ద గాని, పూజా మందిరంలో గాని ఎక్కడైనా చేయవచ్చు. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.

కార్తీక మాస వ్రతాలతో కోరుకునే కోర్కెలు తీరే అవకాశం

కార్తీక మాస వ్రతాలతో కోరుకునే కోర్కెలు తీరే అవకాశం


కార్తీకమాసంలో చేయాల్సిన మరో ముఖ్యమైన పని కార్తీక మాస వ్రతాలు నిష్టగా ఆచరించడం. కార్తిక మాసములో సోమవార వ్రతాన్ని, కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని, క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని, లక్షపత్రి పూజ ను సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరిస్తే మంచిదని చెప్తున్నారు. కార్తీకమాసంలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తే, వన భోజనాలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

కార్తీక దానధర్మాలతో లక్ష్మీ కటాక్షం .. అన్నింటా విజయం

కార్తీక దానధర్మాలతో లక్ష్మీ కటాక్షం .. అన్నింటా విజయం



ఈ కార్తీకమాసంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని దానధర్మాలు చేయడం. కార్తీక మాసంలో దానధర్మాలు చేస్తే మంచి జరుగుతుందని, అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. కార్తీక మాసంలో అన్నీ నియమాలను పాటించటం ఒక ఎత్తైతే, దానధర్మాలు చేయడం మరొక ఎత్తు. కార్తీకమాసంలో నువ్వులను దానం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని, వారికి జీవితంలో తిరుగే ఉండదని చెబుతున్నారు. వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని, అంతా శుభం జరుగుతుందని, అన్నింటా విజయాలు కలుగుతాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Karthika masam: కార్తీక గోపాష్టమి నేడే; విశిష్టత.. గోవులను పూజిస్తే కలిగే అద్భుత ఫలితమిదే!!Karthika masam: కార్తీక గోపాష్టమి నేడే; విశిష్టత.. గోవులను పూజిస్తే కలిగే అద్భుత ఫలితమిదే!!

English summary
It is said that in the month of Karthika, doing things like taking Karthika snana, worshiping the deity, doing lamp worship, doing charity, and doing Karthika masa vratas will bring many results along with Lakshmi Kataksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X