వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. రెండోది, చివరిది అయిన గ్రహణాలు అక్టోబరులో రాబోతున్నాయి. ఈ రెండు గ్రహణాల మధ్య 15 రోజుల అంతరం ఉంటుంది. అశ్వినీ అమావాస్య రోజు సూర్యగ్రహణం, అశ్వినీ పూర్ణిమ రోజు చంద్ర గ్రహణం కనిపించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమవుతుంది.

కన్యా రాశి, చిత్తా నక్షత్రంలో : అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2.25 గంటలకు ఈ సూర్య గ్రహణం ముగుస్తుంది. కన్యారాశి, చిత్తా నక్షత్రాలలో ఏర్పడనుంది. భారతదేశంలో కనిపించదు. అలాగే సూతక్ కాలం కూడా చెల్లదు. జమైకా, క్యూబా, మెక్సికో, బ్రెజిల్, కెనడా, అమెరికా, ఈక్వెడార్, గ్వాటెమాల, పరాగ్వే సహా పలు దేశాల్లో కనిపించనుంది. అలాగే చివరి చంద్ర గ్రహణం అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:06 గంటల నుంచి 2:22 గంటల వరకు ఉంటుంది. దీన్ని మనదేశంలో చూడవచ్చు. 1 గంట 16 నిమిషాలు గ్రహణ సమయం. దీనిని ఖండగ్రాస్ చంద్రగ్రహణం అంటారు.

 grahalu-

భారతదేశంలో సూతక్ కాలం చెల్లుతుందా : జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, అక్టోబర్ 29వ తేదీ చంద్రగ్రహణానికి 9 గంటల ముందు అంటే అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2.52 గంటలకు భారతదేశంలో సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఇది ముగుస్తుందో అప్పుడే సూతకాల కాలం కూడా ముగుస్తుంది. కొన్ని పనులు, శుభకార్యాలు చేయడం నిషేధించబడింది. గర్భిణీలు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు రాకూడదు. అలాగే ఆ సమయంలో వంటలు చేయడం, లేదంటే తినడం లాంటివి కూడా చేయకూడదు. పూజలకు దూరంగా ఉండాలి. ఇప్పటికే ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం, తొలి చంద్ర గ్రహణం ఏర్పడ్డాయి. అయితే వీటికి సూతక్ కాలం చెల్లదు. ఎందుకంటే అవి మనదేశంలో కనిపించలేదు.

English summary
The first solar and lunar eclipses have already occurred this year.The second and final eclipse is coming in October.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X