సరిగ్గా రెండు రోజుల్లో అరుదైన కలయిక.. ఈ రాశులవారిపై ధనవర్షం
సూర్య భగవానుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. గౌరవం, ఉన్నత స్థానం, నాయకత్వ సామర్థ్యానికి ఆదిత్యుడు కారకుడు. ఇటీవలే బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేశాడు. మరోవైపు భానుడు 17వ తేదీ ఉదయం 5.19 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలో ఆదిత్యుడు, బుధుడి కలయికవల్ల బాధాదిత్య యోగంతోపాటు వ్యతిరేక రాజయోగం ఏర్పడుతోంది. ఈ రెండు యోగాలు మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశివారికి అనేక ప్రయోజనాలను కలిగించనున్నాయి. అవి ఏవేమిటనేది తెలుసుకుందాం.
మకరరాశి : మకరరాశి వారికి వ్యతిరేక రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. న్యాయపరమైన కేసుల్లో విజయం సాధిస్తారు. దీనివల్ల ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాత అప్పును తిరిగి చెల్లిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకడంతోపాటు శత్రువులపై ఘన విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి : ఈ రాశివారికి వ్యతిరేక రాజయోగం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం చేసేవారు ఈ సమయంలో అత్యధిక లాభాలను ఆర్జిస్తారు. బ్యాంకింగ్, పెట్టుబడి, దిగుమతి-ఎగుమతులతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రత్యేకంగా కలిసివస్తుంది. భానుడి ప్రభావం వల్ల పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది. జీవిత భాగస్వామి మాటకు విలువివ్వాలి. దీనివల్ల పనులు కలిసివస్తాయి.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశివారికి వ్యతిరేక రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్యం దూరమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలోను, వ్యాపారంలోను ఆకస్మిక ధనలాభం ఉంది. ఆధ్యాత్మిక, మతానికి సంబంధించిన పనులు, ఆ వాతావరణం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిశోధన రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగా కలిసివస్తుంది. వీరికి అదృష్టం తోడుంటుంది.












Click it and Unblock the Notifications