బృహస్పతి చల్లటిచూపుతో మూడు రాశులకు అదృష్టం
జ్యోతిష్యంలో బృహస్పతిని దేవగురువుగా పేర్కొంటారు. అదృష్టం, సంతోషంతోపాటు వివాహానికి కారకుడిగా భావిస్తారు. గురుడు ఏడాదికోసారి తన రాశిని మారుస్తుంటాడు. ఏప్రిల్ 22వ తేదీన గురుడు తన రాశిని మార్చి మేషరాశిలో సంచరించాడు. తాజాగా 2024 మే ఒకటోతేదీ వరకు మేషరాశిలో ఉండనున్నాడు. గురుడి సంచారంవల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసిరానుంది. ఏయే రాశులనేది తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి విషయంలోను వీరికి అదృష్టం తోడుంటుంది. గతంలో ప్రారంభించి ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. పూర్తవడానికి ఇది మంచి సమయం. చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారి కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా కలిసివస్తుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయకేతనం ఎగరవేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు.

మిథునరాశి : మిథునరాశివారికి దేవగురువు శుభదృష్టి ఎంతో కలిసిరానుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. దీనివల్ల వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మేలు కలగజేస్తాయి.
సింహ రాశి : గురుడి సంచారం వీరికి ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. అపారమైన సంపదను పొందుతారు. అదృష్టం కలిసివచ్చి చేపట్టిన ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తిచేస్తారు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అలాగే శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆకస్మిక ధనలాభం ఉండటంవల్ల ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణానికి అలవాటు పడతారు. మతపరమైన పనులపట్ల రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంటుంది.












Click it and Unblock the Notifications