100 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం..ఈ రాశుల వారి జాతకాలు మారిపోతున్నాయ్
భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది.సూర్యగ్రహణాలు ఖగోళంలో జరిగే అద్భుతమైన దృశ్యాలు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు చంద్రుని నీడ భూమిపై పడుతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు.సూర్యగ్రహణాలలో రకాలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం, కంకణాకార సూర్యగ్రహణం. 2025 సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి.
2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025న మధ్యాహ్నం 2:20 ఏర్పడి సాయంత్రం 6:13 వరకు కొనసాగుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది.
సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 21 సెప్టెంబర్ 2025న జరుగుతుంది.అయితే దాదాపు 100 ఏళ్ల తర్వాత మార్చి 29న అరుదైన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడింది. ఇది బృహస్పతి మేషరాశిలో వచ్చి సూర్యునితో మైత్రి ఏర్పడుతుంది. అలాగే పంచాంగ ప్రకారం వైశాఖ అమావాస్య రోజున గ్రహణం ఏర్పడుతుంది. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. దీని వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్యగ్రహణం వల్ల లబ్ది పొందే రాశులను ఓసారి పరిశీలిద్దాం.

వృశ్చిక రాశి
సూర్యగ్రహణం ఎఫెక్ట్ వృశ్చిక రాశి వారిపై చూపించనుంది. సూర్యగ్రహణం ద్వారా ఈ రాశి వారి జీవితంలో తీవ్ర సమస్యలను ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది. ఆస్తిలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.కుటుంబ వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
కుంభ రాశి
సూర్యగ్రహణం వల్ల కుంభ రాశి వారి జాతకాలు సైతం మారిపోతున్నాయి. సూర్యగ్రహణం తర్వాత ఈ రాశి వారు చెడు వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే వ్యాపారాల్లో నష్టం చేకూరే అవకాశం ఉంది.పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నలుగురిలో మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి
సూర్యగ్రహణం ప్రభావం కర్కాటక రాశి వారిపై కూడా ప్రభావం చూపించనుంది.ఈ రాశి వారు వాహనాలు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.వైవాహిక జీవితంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన సమయం వచ్చింది. కెరీర్ పరంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.రోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది.












Click it and Unblock the Notifications