రాశుల వారీగా ఈ తాంబూలాలను నిర్దేశించిన దేవుళ్లకు పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు.. తెలుసుకోండి!!
రాశిని బట్టి ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రాశి వారు వారి రాశిని బట్టి కొంత మంది దేవుళ్లకు కొన్ని నైవేద్యంగా తాంబూలాలను పెడితే కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు. అనేక సమస్యలకు ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. అసలు ఏ రాశి వారు ఏం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేష రాశి వారు తాంబూలంలో మామిడి పండు పెట్టి మంగళవారం రోజు కుమారస్వామికి సమర్పిస్తే వారికి సంపద కలుగుతుంది .వృషభ రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం రోజు రాహువును పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. మిధున రాశి వారు తాంబూలంలో అరటిపండు పెట్టి బుధవారం నాడు ఇష్ట దేవతలను పూజిస్తే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

కర్కాటక రాశి వారు తాంబూలంలో దానిమ్మ పండును పెట్టి శుక్రవారం నాడు కాళికాదేవిని పూజిస్తే వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. సింహ రాశి వారు తాంబూలంలో అరటిపండు ఉంచి గురువారంనాడు ఇష్ట దేవతలను పూజిస్తే వారికి సిరిసంపదలు కలుగుతాయి . కన్యా రాశి వారు తమలపాకులో మిరియాలను ఉంచి గురువారం నాడు వారి ఇష్ట దేవతలను పూజిస్తే అంతా మంచే జరుగుతుంది.
తులా రాశి వారు తమలపాకులో లవంగాలు ఉంచి, శుక్రవారం నాడు ఇష్ట దేవతను పూజిస్తే మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు తమలపాకులో ఖర్జూరం పెట్టి మంగళవారంనాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారు తమలపాకులో కలకండ నుంచి గురువారం నాడు ఇష్టదేవతలను పూజిస్తే వారికి శుభాలు కలుగుతాయి.
మకర రాశి వారి తమలపాకులో బెల్లం ఉంచి, శనివారం కాళికామాతను పూజిస్తే మంచిది. కుంభ రాశి వారు తమలపాకులో నెయ్యి ఉంచి శుక్రవారం నాడు కాళికామాత ని పూజిస్తే మంచిది. మీన రాశి వారు తమలపాకులో పంచదారని ఉంచి, ఆదివారంనాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇలా అన్ని రాశుల వారు వారికి సూచించినట్లు చేస్తే వారికి సకల సంపదలు కలుగుతాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications