వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులు ఇంట్లో ఉండకూడదు.. ఒకసారి మీ ఇంట్లో ఉన్నాయోమో చూసుకోండి
వాస్తు ప్రకారం చాలామంది తమ ఇంటికి సంబంధించి కచ్చితంగా నియమాలు పాటిస్తుంటారు. అవి పాటించకపోవడంవల్ల కష్టాలపాలవుతామనే నమ్మకం, అనుభవాల వల్ల వారు మన పురాతన శాస్త్రమైన వాస్తును కచ్చితంగా అనుసరిస్తారు. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తుంటారు. అవేంటంటే.. కొన్ని కొన్ని వస్తువులు ఇళ్ల్లో ఉండకూడదు. కానీ తెలియక అవి ఉంచుకోవడంవల్ల ఆర్థిక కష్టాలు, సమస్యలు, ప్రశాంతత కోల్పోవడం జరుగుతుంటుంది. అయితే ఏ వస్తువులు ఉండకూడదో తెలుసుకొని వాటిని తొలగించుకుంటే ఏ సమస్యా రాదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
దేవుడి పూజ కోసం, అలంకరణ కోసం రోజూ చాలామంది పూలు కొంటుంటారు.
అందులో కొన్ని వాడిపోయినవి ఉంటాయి.
వాటిని పూజకు వాడకూడదు.
పక్కన పడేసి తాజా పూలనే వాడాలి.

పగిలిపోయిన వస్తువులు, విరిగిపోయిన వస్తువులు ఉండకూడదు.
దీనివల్ల వ్యతిరేకతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
జీవితంలో పురోగతికి ఆటంకం కలిగిస్తాయి.
వృద్దిలోకి రావడం కష్టమవుతుంది.
అనేకరకాల వైర్లు ఇంట్లో ఉంటుంటాయి.
కొన్ని చిక్కుపడి ఉంటాయి.
అవి సానుకూల శక్తిని దూరం చేస్తాయి.
ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తాయి.
అందుకే చిక్కుపడిన వైర్లను ఇంట్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
తాజ్ మహల్ గురించి అందరికీ తెలుసు.
ఎందుకంటే మనదేశంలో టూరిస్టులు వెళ్లే స్థానంలో మొదటి స్థానంలో నిలుస్తుంది.
వాస్తవానికి తాజ్ మహల్ అనేది సమాధి.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య మరణిస్తే గుర్తుగా కట్టించాడు.
అతని భార్య ముంతాజ్ బేగం సమాధే తాజ్ మహల్.
అక్కడ వ్యతిరేక శక్తి ఉంటుంది.
ఇంట్లో తాజ్ మహల్ ఫొటోలను అందుకే పెట్టకూడదని చెబుతారు.
ఇంట్లో మహాభారతం ఫొటోలు, పుస్తకాలు ఉంచుకోకూడదని చెబుతున్నారు.
అవి ఉంటే గొడవలు వస్తాయంట.
కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయంట.












Click it and Unblock the Notifications