2 శతాబ్దాల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా బదిలీ చేస్తాయి. దీనిద్వారా ఒకదానికొకటి శుభ దర్శనం చేసుకుంటాయి. దీని ప్రభావం సమాజంతోపాటు వ్యక్తిగతంగా మానవులపై కనిపిస్తుంది. ఏప్రిల్ 6వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. మే 2వ తేదీ వరకు అక్కడే ఉంటాడు.శుక్రుడు, బృహస్పతి 3, 11వ ఇంట్లో ఉంటారు. శుక్రుడు, శని అదే సమయానికి నాలుగో రాశిలో ఉంటారు. అన్ని రాశులపై ఈ ప్రభావం ఉన్నప్పటికీ మేష రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశివారిపై ఎక్కువగా ఉంటుంది. వారికి కలిసివస్తుంది.
మేష రాశి:మేష రాశి వారు ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కోరికలు నెరవేరుతాయి. అదే సమయంలో పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి పురోగతి సాధించగలరు.

సింహ రాశి:గురు, శుక్రుడు, శని దేవుల సంబంధం సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విజయం సాధించడంతోపాటు వ్యాపారవేత్తలు వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు దూరమవుతాయి. ప్రేమ సంబంధాలు బాగుంటాయి.
వృశ్చిక రాశి:గురు, శుక్రుడు, శని దేవుల దృష్టి సంబంధం వీరికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టాన్ని పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూసేవారికి ఇది అనుకూల సమయం. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. చేస్తున్న పనిలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
కుంభ రాశి:అదృష్టం ఈ రాశివారి వెంటే ఉంటుంది. వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. భౌతిక ఆనందాన్ని పొందుతారు. ఆస్తి లావాదేవీలకు అత్యంత అనుకూలమైన సమయం ఇది.












Click it and Unblock the Notifications