30 ఏళ్ల తర్వాత నవపంచమ యోగం.. ఈ రాశులపై ప్రభావం

30 ఏళ్ల తర్వాత శని, కేతువు మరియు కుజుడు గ్రహాల కలయిక వల్ల ట్రిపుల్ నవపంచమ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం సంచరించినప్పుడల్లా అవి ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. దీనివల్లే శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. 30 సంవత్సరాల తర్వాత అంగారకుడు-కేతువు, శని-కేతువు, కుజుడు- శని గ్రహాలు నవపంచమ యోగాలు చేస్తున్నాయి. ఈ ట్రిపుల్ నవపంచమ యోగం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం భారీగా కలిసిరానుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
నవపంచమ యోగం ధనుస్సురాశి వారికి బాగా కలిసివస్తుంది. వీరి జాతకంలో ఉన్న శనిదేవుడు మూడో ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంట్లో కేతువు బలంగా ఉన్నాడు. దీనివల్ల శక్తి, ధైర్యం పెరుగుతాయి. ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. మీరు మొదటినుంచి అనుకుంటున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలుకానీ లేదంటే వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

after 30 years forming nava panchama yoga.. Influence on these zodiac signs

కుంభరాశి
కుంభ రాశి వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కుజుడు శని నుంచి 5వం స్థానంలో, కేతువు అంగారకుడి నుంచి 5వ స్థానంలో, కేతువు నుంచి 5వ స్థానంలో శని ఉన్నాడు. కుంభరాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారు భారీగా లాభాన్ని కళ్లజూస్తారు. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం అందుతుంది. అంతేకాదు వీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

మిధునరాశి
నవపంచమ యోగం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి త్రిభుజంలో ఈ యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఆదాయం రెట్టింపవడమే కాకుండా ఆర్థిక కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కల ఫలించి వారికి ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకునే అభ్యర్థులు విజయం సాధిస్తారు. కోరికలు నెరవేరడంతోపాటు కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి కూడా ఇదే అనుకూల సమయం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, బెట్టింగ్, లాటరీ వంటివి వీరికి లాభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+