ఏపీ, బెంగళూరు మీదుగా ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.

తాజాగా హైదరాబాద్ నుంచి మంగళూరు సెంట్రల్ కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొదటి రైలు బుధవారం అంటే.. ఈ నెల 3న పట్టాలెక్కనుంది. 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, హాల్ట్ స్టేషన్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ నెల 1 నుంచే అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభమైంది.

Special Trains From Hyderabad to Mangaluru Central to Ease This Season Passenger Rush From June 3

ఈ నెల 3, 10, 17, 24 తేదీల్లో ప్రతి బుధవారం తెల్లారు జామున 4: 20 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07097 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటుంది.

ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు మంగళూరు సెంట్రల్ నుంచి బయలుదేరే నంబర్ 07098 ప్రత్యేక రైలు మూడో రోజు తెల్లవారు జామున 4 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, సేలం, ఈరోడ్, పొదనూర్, పాలక్కాడ్, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వడక్కార, థలస్సేరి, కన్నూర్, కన్నూర్, పయ్యనూర్, కన్హాగాడ్, కాసర్ గాడ్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణీకుల సౌకర్యార్థం 3 ఏసీ 2-టైర్, 5 ఏసీ 3-టైర్, 10 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు 2 లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్‌లు అందుబాటులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+