సంక్రాంతి తర్వాత ఈ రాశులకు ఏడాది మొత్తం పండగే

మకర సంక్రాంతి అంటేనే పెద్ద పండగ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. కొత్త సంవత్సరంలో అన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకోనుండటం విశేషం. మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై మాత్రం విశేషంగా ఉండనుంది. సంక్రాంతి తర్వాత కూడా ఏడాది మొత్తం పండగగా ఉండే రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృషభరాశి
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ఏడాది పొడవునా ధనలాభం ఉంది. అనుకున్న కోరికలు నెరవేరడంతోపాటు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సమయంలోనే దాన్ని పట్టాలెక్కించాలి. కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.

after makara sankranthi these zodiac signs will get amezing money benefits

మిథున రాశి
ఆర్థికంగా బలపడతారు. స్నేహితులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడంవల్ల మనసు ఉల్లాసభరితంగా మారుతుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని ఆ ప్రకారం ప్రారంభించాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం కనపడుతోంది. పెండింగ్ లో ఉన్న సమస్యలు చికాకు కలిగిస్తుంటాయి. వాటినుంచి విముక్తి లభిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం తథ్యం.

కర్కాటక రాశి
ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారికి ఇది అనుకూల సమయం. ఊహించని రీతిలో వ్యాపారస్తులు లాభాలను పొందబోతున్నారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు మీవద్దకు చేరుకుంటుంది. గురుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాయి.

కుంభరాశి
గురుడు, శుక్రుడు అనుకూలంగా ఉండటంతో జాతక చక్రమే మారిపోనుంది. సంపద పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు. వాహనాలపై దూర ప్రయాణం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రయాణాన్ని మానుకోవడం ఉత్తమం. ఏడాది మొత్తం ఆదాయం వస్తూనే ఉంటుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు శుభవార్తలు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+