అక్షయ తృతీయరోజు చేయకూడని పనులు
వైశాఖ శుక్లమాసం తృతీయ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఆరోజు బంగారం, వెండి, ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తే లాభం కలుగుతుందని అందరి నమ్మకం అందుకే అక్షయ తృతీయ రోజున మార్కెట్ కళకళలాడుతుంటుంది. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అత్యంత అనువైన సమయం కూడా అదేనని భావిస్తారు. ఆరోజు ఏ చిన్న పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు చేసే పనుల్ని బట్టి ఫలితం లభిస్తుంది. అలాగే పొరపాట్లు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన అక్షయ తృతీయ ఉంది.
చేయకూడని పనులు
* అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీల్ సామాన్లు కొనకూడదు. ఈ వస్తువులపై రాహువు ప్రభావం ఉంటుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది.

* అక్షయ తృతీయ రోజు మాంసాహారం, వెల్లుల్లి-ఉల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. మత్తు పదార్ధాలు సేవించకూడదు. సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుందని చెబుతున్నారు.
* పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు.
* అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం, ధనం నిల్వ ఉంచే ప్రాంతాన్ని శుభ్రం చేయడంతోపాటు విష్ణు భగవానుడిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరమవుతుంది.

* అక్షయ తృతీయ రోజు ధనహాని శుభశకునం కాదు. బంగారు, వెండి ఆభరణాలు పోగొట్టుకోకూడదు. అందరూ అప్రమత్తంగా ఉండాలి.
* ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి దగ్గరా అప్పు తీసుకోకూడదు.
* అక్షయ తృతీయ రోజు అబద్ధం ఆడకూడదు. దొంగతనానికి దూరంగా ఉండాలి. ఎవర్నీ మోసం చేయకుండా జీవించాలి. లాటరీ, జూదం వంటివాటికి దూరంగా ఉండాలి. లేకపోతే తీవ్ర ఇక్కట్లకు గురవ్వాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications