100 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
దేవతల గురువైన బృహస్పతి దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈనెల 8వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. అలాగే కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల ప్రభావం కొన్ని రాశులపై బలంగా పడుతోంది. దీనివల్ల వారు డబ్బుల పరంగా, సమాజంలోను అనేక ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
కన్యారాశి
ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతాయి. కోరుకున్న కోరికలను నెరవేర్చుకునే సామర్థ్యం వస్తుంది. కొత్తగా కొన్న ఆస్తుల వల్ల సంపద పెరుగుతుంది. శని ఏడో స్థానంలో ఉండటం వీరికి బాగా కలిసిరానుంది. అరుదైన అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

మకర రాశి
ఈ రాశివారు కెరీర్ పరంగా మంచి పురోగతిలోకి వెళతారు. కార్యాలయాల్లో ఉన్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. అందరూ సహకారం అందిస్తారు. ఏ పని తలపెట్టినా తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. వీరికి కూడా శనిదేవుడు ఏడో స్థానంలో ఉండటం బాగా కలిసివస్తోంది.
మిథున రాశి
వందేళ్ల తర్వాత వీరికి అద్భుతమైన అవకాశాు రాబోతున్నాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నవారి కోరిక నెరవేరుతుంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ మనశ్శాంతిగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేవారికి ఇది అనువైన సమయం.
కర్కాటక రాశి
శతాబ్ద కాలం తర్వాత వీరికి మంచి పురోగతి కనపడుతోంది. వ్యాపారస్తులు మంచి విజయాలు, మంచి లాభాలు సాధిస్తారు. సకాలంలో పనులు పూర్తిచేసేవారు ఊహించనిరీతిలో ప్రయోనాలను అందుకుంటారు. గతంలో పెట్టుబడులు పెట్టినవారు ఈ సమయంలో మంచి రాబడిని అందుకుంటారు. వీరికి పేరు కూడా బాగా వస్తుంది.












Click it and Unblock the Notifications