దేవుడి పటాలు కింద పెట్టి అటూ, ఇటూ తిరుగుతున్నారా? వాస్తు ఏం చెబుతోంది?
ఇంటి నిర్మాణానికే కాకుండా ప్రతి గదికి వాస్తు ఉంటుంది. నడకకు వాస్తు ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు వాస్తు ఉంటుంది. చాలామంది దేవుడి చిత్రపటాలు, విగ్రహాలు ఎక్కడ పెట్టాలి? టేబుల్ పై పెట్టొచ్చా? లేదంటే కాళ్లు ఎటువైపు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే దేవుడి పటాలు చూడగలుగుతాం అంటూ అనేక సందేహాలకు లోనవుతుంటారు.
పూజా స్థలం కావల్సినంత లేకపోవడం, పూజకు ప్రత్యేకంగా గది లేకపోవడంలాంటివాటితో ఈ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. వాటికి సంబంధించిన పరిష్కారాలను తెలుసుకుందాం.

పూజ గది అంటేనే చాలా పవిత్రమైన గది.
ఈశాన్యం దిక్కులో ఉండాలి.
దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా మంచిది.
కొన్ని ఇళ్ల ల్లో తగినంత స్థలం లేక టేబుల్ పై పెట్టుకుంటారు.
దేవుళ్ల కోసం ప్రత్యేకమైన స్థలం ఉంటే చాలా మంచిది.
వాటిని కింద పెట్టి అటూ ఇటూ తిరగడం మంచిది కాదు.
టేబుల్ పై పెట్టి, టేబుల్ కు సమాంతరంగా స్టూల్ పై కూర్చొని పూజలు చేసుకోవచ్చు.
స్థలం లేకపోతే చెక్కతో చేసిన లేదంటే మార్బుల్ మంటపాలను గోడకు బిగించుకోవాలి.
హాలులో ఒక చిన్న అల్మారాను కేటాయించి, దానికి తలుపులు బిగించండి.
పూజ చేసిన తర్వాత తలుపులు మూసేయండి.
స్థలం తక్కువగా ఉంటే ఎక్కువ ఫోటోలు వద్దు.
మీకు ఇష్టమైన రెండు దేవుడి పటాలు పెట్టి పూజించండి.
దేవుడి ముఖం వైపు కాళ్లు పెట్టడం మంచిది కాదు.
దక్షిణం వైపు తల పెట్టుకొని, ఉత్తరం వైపు కాళ్లు పెట్టుకోవచ్చు.
పడమర వైపు తల పెట్టుకొని, తూర్పు వైపు కాళ్ళు పెట్టుకోవచ్చు.
పెద్దలు, గురువులు, దేవుళ్లు పట్ల గౌరవాన్ని పాటిస్తూ వారివైపు కాళ్లు పెట్టకూడదు.
పాదాల నుంచి ప్రతికూల శక్తి వెలువడుతుంది.
కొంతమంది బెడ్ రూంలో అల్మారా పెట్టుకుంటారు.
పడుకొనేటప్పుడు దేవుడి పటాలకు ఎదురుగా ఒక తెర ఏర్పాటు చేయండి.
దీనివల్ల మీ పాదాలకు, దేవుడి పటాలకు ఒక అడ్డు ఉన్నట్లు అవుతుంది.












Click it and Unblock the Notifications