• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేషరాశిలో కుజు రాహువుల కలయిక వలన కొన్ని రాశులకు అనుకూలంకాదు

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం జ్యేష్టమాసం సోమవారం రోజున అశ్విని నక్షత్రం మొదటి పాదంలో ఉదయం 5 : 40 నిమిషాలకు మేషరాశిలో కుజ గ్రహం ప్రవేశం చేస్తున్నది. రాహువు జూన్ 14 రోజున భరణి నక్షతరం నాల్గవ పాదం, మేషరాశిలో ఉదయం 8:57 నిమిషాలకు ప్రవేశం చేసిఉన్నారు. కుజుడు ఆగష్టు 10 వరకు మేషరాశిలో ఉంటారు. రాహువు ఈ సంవత్సరం అంతా ఇక్కడే తిష్టవేస్తారు. మేషరాశిలో రాహువుతో కలయిక వలన కుజ యోగం ఏర్పడబోతోంది. కుజ, రాహు గ్రహాలు కలయిక జ్యోతిషశాస్త్ర రిత్య ఈ రెండు గ్రహాల సంయోగం అంత మంచిది కాదు. దీని వలన కొన్ని రాశుల వారికి సుమారు 44 రోజులు కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఈ ఫలితాలు వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకంలో గ్రహ బలాబలాలపై ఆధారపడి ఫలితాలు కుడి ఎడమగా ఉంటాయి.

కాలగమనంలో ప్రతి గ్రహం వాటి నిర్ధిష్ట సమయంలో రాశి మారుతుంది. ఇప్పటికే జూన్‌లో చాలా గ్రహాల రాశిచక్రాలు మారాయి. ఇప్పుడు గ్రహాల సైన్యాధ్యక్షుడైన కుజుడు తాను తన స్థానానికి మారాల్సి వచ్చింది. కుజుడు జూన్ 27న తన సొంత రాశి అయిన మేషరాశిలో మకాం మార్చుకున్నాడు. రాహు గ్రహం ఇప్పటికే మేషరాశిలో ఉంది. ఈ నేపథ్యంలో మేషరాశిలో కుజుడు, రాహువు కలయిక ఉండబోతోంది. ఈ కుజ, రాహువుల కలయిక అంగారక యోగాన్ని ఏర్పరుస్తుంది. శాస్త్ర ప్రకారం కుజ యోగం శుభప్రదంకాదు. అంగారక యోగ సమయంలో అనేక రకాల ఇబ్బందులు, విపత్తులను ఎదుర్కోవలసి పరిస్థితులను ఉత్పన్నం చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

 Aries: when Kuju and Rahu combine its not a good sign for few constellations-Know here

జ్యోతిషశాస్త్ర ప్రకారం కుజ గ్రహాన్ని అగ్ని మూలకానికి కారకంగా పరిగణిస్తారు. మరోవైపు రాహువు ఛాయా గ్రహంగాను, అశుభ గ్రహంగా భావిస్తారు కాబట్టి అంగారక యోగం ఏర్పడటం వలన కొన్ని రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి. ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- అంగారక యోగం వృషభరాశి నుండి వ్యయ భావంలో ఏర్పడుతుంది. ఈ కారణంగా నష్టాలు, అధిక ఖర్చులకు సంబంధించిన సమస్యలు. ఈ సమయంలో మీ ఖర్చులు పెరుగుతాయి. అంచనా వేసిన బడ్జెజ్‌ దెబ్బతింటుంది. మీరు మీ తోబుట్టువులతో గొడవ పడే అవకాశాలున్నాయి. మాట్లాడేటప్పుడు సహనం, సంయమనం పాటించండి. ఈ సమయంలో శత్రువులు మీకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర చేయవచ్చు. వ్యాపారంలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉంటే మంచిది. లేకుంటే నష్టాలు సంభవించవచ్చును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- అంగారక యోగం సింహరాశి నుండి నవమ భావంలో ఏర్పడుతుంది కాబట్టి విదేశీ సంబంధిత ప్రయాణాల విషయాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఇతర విషయాలలో అంతగా కలిసి రాదు. ఏదైనా పెద్ద ఒప్పందం ఖరారు అయ్యే సమయానికి ఆగిపోవచ్చు. మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే.. అది కొన్ని కారణాల వల్ల రద్దయ్యే అవకాశముంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, ప్రతి ఉదయం సూర్యదయ సమయాన ప్రత్యక్ష సూర్యనారాయణ భావగవానికి రెండు చేతులు పైకి చాచి నమస్కారం చేసుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ సమయంలో మీరు ప్రేమ వ్యవహారాలలో వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు. విద్యలో ఆటంకాలు ఉండవచ్చు. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశముంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావచ్చు. ఆఫీసులోనూ జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులు మీతో గొడవ పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
Due to the combination of Kuju Rahu in Aries it is not suitable for some constellations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X