Debangshu Panda: మమతను మట్టికరిపించిన ఈయన గురించి షాకింగ్ విషయాలు తెలుసా..?

బెంగాల్ లోని ఫాల్టా నియోజకవర్గంలో కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నియోజకవర్గంలో అధికార బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఫాల్టాలో లక్షకుపైగా మెజారిటీతో గెలిచి బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా చరిత్ర సృష్టించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఈ ఎన్నికల్లో 1,49,666 ఓట్లను సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 1,09,021 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు.

అయితే 2011 నుంచి ఫాల్టా నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. అంతేకాక ఈ నియోజకవర్గం తృణమూల్ సెకండ్ ఇన్ కమాండ్ అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. అలాంటి చోట దేబాంగ్షు పాండా ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. దాంతో బీజేపీకి బెంగాల్ అసెంబ్లీలో అసెంబ్లీ సీట్లు 208 కు చేరాయి.

ఇక తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ రీ పోలింగ్ కు కేవలం రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోవడంతో ఈవీఎంలలో ఆయన పేరు, టీఎంసీ గుర్తు అలాగే ఉన్నాయి. ఈ ఫలితాల్లో ఆయన కేవలం 7,783 ఓట్లతో నాలుగో స్థానానికి పడిపోయారు. ఇక సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,645 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా 10, 084 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.

రిపోర్ట్స్ ప్రకారం.. దేబాంగ్షు పాండా గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అర్హతను కలిగి ఉన్నారు. ఆయన 2006 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పూర్తి చేశారు. ఆయన వృత్తి రిత్యా ఒక న్యాయవాది. 2026 ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఆయన ఈ వృత్తిలోనే కొనసాగారు.

DebangshuPanda BJP Winner from Falta Over One Lakh Votes Shocking Facts You Must Know About Him

ఇక ఫలితాలు వెల్లడైన తర్వాత దేబాంగ్షు పాండా మాట్లాడుతూ.. ఫాల్టా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫాల్టా ప్రజలు బీజేపీపై ఆశీస్సులు కురిపించారని అన్నారు. టీఎంసీ కంచుకోటగా భావిస్తున్న ఫాల్టా నియోజకవర్గంలో ఓ సాధారణ న్యాయవాది అయిన దేబాంగ్షు పాండా సాధించిన ఈ విజయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+