తెలంగాణ మహిళలకు సీఎం కానుక.. రేపటి నుంచే ప్రారంభం..
రాష్ట్రంలో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసింది. ఆ తర్వాత రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహాలక్ష్మి పథకం కింద ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
అలాగే గృహ జ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. అంతేకాక ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అలాగే నిరాశ్రయులైన వారికి ఇళ్ల స్థలంతోపాటుగా నిర్మాణానికి నిధులు ఇస్తారు. ఇక తాజాగా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 8 వేల మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.

రేపు ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియట్ లేదా ప్రజాభవన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు స్థానిక మహిళా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను వారికి వివరించనున్నారు. క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై వారి నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications