కోపం, వేగం: మేష రాశి వారి ప్రాథమిక స్వభావము ఎలా ఉంటుందంటే?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మేష రాశి వారి ప్రాథమిక స్వభావము (మార్చి 21 నుండి ఏప్రియల్ 20 వరకు జన్మించిన వారి మామూలు స్వభావము చాలావరకు ఇలా ఉంటుంది)
మేష రాశి - చరరాశి - అగ్నితత్వపు రాశి

ఈ రాశికి చిహ్నము గొర్రె . జీవులలోని తీవ్రతరము, బలము, దృఢత్వము, నిశ్చయాత్మకమైన గుణము, సాహసము వీటన్నిటి కలయికే మేషరాశి, అతివేగము, మూర్ఖత్వము కూడా వీరిలో అంతర్గతముగా దాగి యుండును. వీరు ఏదేని ఒక పనిని సూటిగా చేయడం, విషయాల్ని ముక్కుసూటిగా, నిర్భయంగా, ఆవేశంగా వ్యక్తపరుస్తూంటారు. చాలా సాహసంగా ప్రవర్తిస్తుంటారు. తమను పదిమంది బలపరిస్తే, నాయకునిగా ప్రవర్తించుట వీరి లక్షణము, లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ప్రయాసల నైనా సహించగలరు.

astrologer tells about Aries

చాలా దృఢమైన, బలిష్టమైన శరీరాకారం, చక్కగా మాట్లాడగల నేర్పుగలిగి వుందురు. తమ వాక్పటిమతో ఎంతో మందిని ఆకర్షించి, తమవెంట తిప్పకొనుచూ, సాహస కార్యములు సైతం అవలీలగా సాధించగలరు. అంటిపెట్టుకునే వుంటూ, వీరికి చేయూతగా పుంటారు. వీరు స్వేచ్చాజీవులు. స్వతంత్ర అభిప్రాయములు కలవారు. స్వాతంత్ర్యమునకు అడ్డుతగిలిన, పనిని సగంలోనే నిలిపివేయు మూర్ఖత్వము కలిగివుంటారు. వీరి స్వేచ్చను అరికట్టకుండా వదలి వేసినచో, అన్నికార్యాలలో అన్నిటినీ సాధించగలరు.

ఒక విధమైన పట్టుదలతో విజయాలు సాధించుట అనే గుణం వలన, తివ్ర నిర్లక్ష్యము, ఆహం కారము, మూర్ఖత్వము అనేటువంటి గుణాలు ప్రకోపించి, ఈ రాశివారు చెడిపోవుటకు, పతనమగుటకు కారణాలవుచున్నాయి. పైగా వీరు పొగడ్డ లకు లొంగిపోయే స్వభావులగుటచే వీరిని కొందరు మాటలతో మోస గించి, తమ స్వంత పనులకు ఉపయోగించుకొనుట జరుగును.

ముఖ్యముగా కన్యారాశి యందు జన్మించినవారు (షష్ణాష్టకరాశులు - గమనించ వలయును) వీరిని విపరీతముగా, స్వకార్యములకు వుపయోగించుకొనుట అనుభవముతో కానవచ్చుచున్నదీ, వీరు ఎప్పడూ నిత్య, నూతన యవ్వన ముతో నిండిపండుట గమనించవచ్చును.

పదిమందికి యోగించు పనులు చేయడం వీరిలో ఎక్కువ. వీరిలో నిర్లక్ష్య ధోరణిని ఆరికట్టుకోలేకపోయినచో వీరు పతనమగు పరిస్థితులు కలుగును. ఎదుటివారితో సరిపడు ప్రవర్తించగల నేర్పు వీరికి తక్కువ. లౌక్యము తెలియనందున మోస పోవుట ఎక్కువ. వీరు క్రియాశీలురు. ఆలోచించి అమలుపరచుట అనేది వీరికి వ్యతిరేకము. మనసులో ప్రవేశించిన భావాన్ని కార్యరూపమున అమలుచేయుట వీరి నిర్ణయము. క్రమశిక్షణ వీరి పట్టు. అందువలననే వీరు డ్రిల్లు మాస్టర్లుగా ఎక్కువ చూడగలము. కాఠిన్యము ప్రదర్శించుటవలన వీరి క్రిందివారు వీరిపట్ల పైకి భయము నటించుట, లోన వీరి యెడల కోపము వుండును. కుటుంబ విషయములలోనూ, వీరికి యిదే జరుగును. నాయకత్వము వహించి, ఇతరులను అదుపులో నుంచుట వీరి లక్షణము. వీరు దయాగుణము కలవారే. కాకుంటేటే విపరీతమైన ప్రేమ లేకుంపే విపరీత మైన ద్వేషం వీరి మార్గాలు.

ఎదుటివారి నుండి తమకు తగిన ప్రేమ! ఆదరణ లభించనపుడు బాధపడు స్వభావులు, దైవభక్తి, విశ్వాసములున్నప్పటికినీ వీరు ఆచారాలను, ఛాందసాలను పాటింపరు. ఈ రాశిలో పట్టినవారు కొందరు, మొరటుదనముతో ప్రవర్తించుట, హంతకులుగా మారుట, తగవులందు యిష్టత ప్రదర్శించుట మొదలగు గుణములు కలిగియుందురు, శారీరకముగా, మానసికంగా శక్తి, ఉత్సాహాన్ని నింపుకొనివుంటారు గనుక వీరు విప్పడూ స్త్రీ లోలురుగానే వుంటారు. స్త్రీ సాంగత్యాన్ని ఎక్కువగా అభిలషిస్తారు.

వీరి ఈ బలహీనతవలన స్త్రీకి లొంగిపోవుట, స్త్రీల విషయములలో మోసపోవుట జరుగును. ప్రేమ వివాహము వీరికి కొంత సుఖాన్నివ్వదనే చెప్పాలి. వ్యామోహంతో చాలా మార్పులు చిక్కులు తెచ్చుకొందరు. వివాహ జీవితము సుఖప్రదముగా జరిగిపోవా లని ఆశిస్తే, వీరు చాలా వివేకంగా, క్రమపద్దతిలో జీవితాన్ని నడుపుకోవాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about Aries qualities.
Please Wait while comments are loading...