వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పగడాల ధారణవల్ల కలిగే శుభ యోగములు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్రహ్మజాతికి, క్షత్రియజాతికి సంబంధించిన ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతుల ననుసరించి ధరించిన యెడల చాలా శుభము జరుగుతుంది. ఆచరించే ప్రతికార్యములోను విఘ్నాలు అంతరించి ఆయాపనులలో విజయము లభిస్తుంది. అకారణ శత్రుత్వములు తొలగిపోయిజన వశీకరణ లభించగలదు.

పగడము అగ్నినుంచి, ఆయుధములనుంచి క్రూర శత్రువులనుంచి తగిన రక్షణ చేకూర్చగలదు. ఆకస్మిక ప్రమాదము లను గండములను తప్పించి క్షేమము కలిగించగలదు.

చాలా కాలముగా బాధిస్తున్న ఋణబాధలు, సూర్యోదయమునకు చీకట్లు తొలగిపోయినట్లు తొలగిపోతాయి. వివాహ విషయాల్లో కలిగే ఆటంకాలు అంతరించి తొందరగా వివాహము కాగలదు. కుజదోషమువలన దాంపత్య జీవితములో సంభవించే కలతలు, కార్పణ్యాలు, పరస్పరవైషమ్యాలు, విడాకులువంటి దుర్మార్గభావనలు, అంతరించి, అన్యోన్య ప్రేమపూరితమైన అనురాగములో దంపతులు దీర్ఘకాలము సుఖసంసార జీవనము చేసికొనుటకు తోడ్పడగలదు.

astrologer tells about corals

భారీయంత్ర పరిశ్రమలలో తరచుగా కలుగుచుండే అనేక ప్రమాదాలు, మోటరువాహనాలకు కలిగే నష్టాలు, శత్రువులు కుయుక్తులవల్ల సంభవించే రాజకీయబాధలు, పోలీసుకేసులు, ఇతరబాధలు, లివర్ వ్యాధులు, మూలశంక, రక్తపోటు, జ్వరము, దేహతాపము, చర్మ వ్యాధులు, గడ్డలు, వ్రణములు, వాపులు, కీళ్ళబాధలు, జననేంద్రియములకు సంబంధించిన అన్ని రోగములు కడుపునొప్పి (అల్సరు) కాన్సర్ మొదలగు యింకా అనేక వ్యాధులను శీఘ ముగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు పగడము తోడ్పడగలదు.

పగడమును ధరించినవారికి జీవితములో నైరాశ్యము, బద్దకము, సోమరితనము అనేవి వుండవు. సహనం, సాహసము, విజృంభణ అధికంగా వంటవి. అన్యాక్రాంతములోనున్న భూములు స్వాధీన మగుతవి. పశుసంపద వృద్ధినంది వ్యవసాయరగంలో విశేష లాభాన్ని పొందగలరు. మిలటరీ, పోలీస్ శాఖల్లో (అటువంటివే ఇతర శాఖలు) పనిచేసేవారు, క్షత్రియజాతి పగడాన్ని ధరించటము చాలా మంచిది. వారి వృత్తిలో అసాధారణ ప్రతిభ కలవారై, ప్రతిపనియందు విజయాన్ని పొందుతుంటారు. పగడానికి అధిపతి యైన కుజ గ్రహము బలముకలిగి శుభస్థానాల్లో వుంటే ఎంత మంచి చేస్తాడో, ఆ విధంగానే బలము కలవాడై అశుభస్థానాల్లో వుంటే అంతటి అపకారం కూడా చేస్తాడు.
ఆయనకు ప్రీతికరమైన పగడాన్ని ధరించినవారికి కుజ గ్రహము ప్రసన్నుడై సకల ఆయురారోగ్య భోగభాగ్యసంపదలు, రాజపూజ్యత, గౌరవము, ఆరోగ్యము, దీర్గాయువు, సకలసౌఖ్యాలు కలుగజేస్తాడు. పగడపు పూసలమాలను ధరించటంవల్ల కూడా పై విధమైన ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్షమాలయందు ఏడు పగడాలుగానీ కనీసము ఒకటి రెండు పగడాలు గానీ చేర్చిధరించవచ్చును. ఇతర నవరత్నాలవలె పగడాలు అధిక ధరలు కలిగియుండక అందుబాటు ధరల్లో లభిస్తాయి.

పగడమును ధరించే పద్ధతి
పరిశుభ్రమైన పగడాలు ధారణకు యోగ్యముగా నుంటవి. బ్రహ్మజాతి ప్రవాళము బరువుగానుండి ప్రకాశవంతముగా నుంటుంది. క్షత్రియజాతికి బరువు మాత్రము తక్కువగా ఉంటుంది. ఇలాంటి పగడమును ఏడు క్యారెట్లుగల దానిని ధరించటం శ్రేష్టము. త్రికోణాకార ముగనున్న పగడము విశేష ఫలప్రదము. అట్లకానిచో బాదముకాయవలెనున్న దానిని వాడవచ్చు. నలుచదరము, వర్తులము విల్లవలె నుండునది. నక్షత్రా కారముగా నున్నట్టి పగడములు ధారణకు అంతగా ఉపయోగించవు. పగడము చిన్నదైనా దోషరహితంగా వుండాలి. బంతివలెనున్న ప్రవాళాలు మాలల యందు, ఆభరణములందు కూర్చుకొనుట ఉత్తమము.

పగడమును కూర్చే ఉంగరము బంగారముతోగానీ లేక వెండి, పంచ లోహములతో గానీ చేయించాలి. ఈ ఉంగరముయొక్క పీఠ భాగము ముక్కోణాకారముతో ఉండి దాని చుట్టు వలయరేఖను ఏర్పరచ టము చాలా ముఖ్యమయు. కృష్ణ పక్షములో చతుర్ధశీ మంగళ వారము వచ్చిన దినమందుగానీ, లేక కుజుడు మకరరాశిలో ధనిష్ణా నక్షత్ర సంచారముచేసే కాలములో ఏదో ఒక మంగళవారమునాడుగానీ, మధ్యా హ్నము 1- 2 గంమధ్య కాలములో దక్షిణ ముఖముగా కూర్చుని పగడమును ఉంగర ములో బిగించవలెను. ఆ తర్వాత ఆ ఉంగరమును ఒక దిన మంతయు నవధాన్యములోఉంచి, మురుదినమంతయు పంచగవ్య (ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుపంచకము, గోమయము కలిపినది) యందుంచి, మూడవరోజున సుగంధద్రవ్యాల తోడను, ఎర్ర చందనపు నీళ్ళచేతను రుద్రాభిషేకమును జరిపించి శుద్ధిగావించవలెను.
ధరించెడివారు తమకు తారబల చంద్రబలములు గలిగిన శుభ తిథులయందు (శనివారము కాక) మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నములు వర్తించు వేళలందు ఉంగరము కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి. ధరించుటకు పూర్వమే ఉంగరమునకు షోడశోపచార పూజలు జరిపి, నమస్కరించి, గురువులను, గణపతిని ధ్యానించి దక్షిణ ముఖముగా నిలబడి ఉంగరమును కుడి అరచేతియందుంచుకొని లం ఐం హ్రీం శ్రీం మహీపుత్రాయ సకలారిష్ట నివారణాయ క్షీం క్షీం స్వాహా" అనే మంత్రాన్ని నిశ్చలముగా 108 పర్యాయములు జపించి, ఉంగరమును మూడుసార్లు కనుల కద్దుకొని వ్రేలికి ధరించవలెను.

స్త్రీలు మాత్రము ఎడమచేతి అనామికా వ్రేలికి ధరించటం శుభప్రదము. మాలలు ఇతర ఆభరణములందలి పగడము లకు కూడా పై విధముగా శుద్ధిని, పుణ్యకార్యక్రమములను నిర్వర్తించి ధరించుట శాస్త్రసమ్మతము. ఉంగరమునకు అడుగుభాగము రంధ్రము కలిగి యుండవలెను.

English summary
Astrologer described about corals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X