గ్రహ‘గో’చారము అంటే ఏమిటి?: వాటి ఫలితాలెలా ఉంటాయి?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్ధం. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు,గ్రహలు అనేవి ఏవి గ్రహాలో ఏవి నక్షత్రాలో మామూలు ద్రూష్టితో చూస్తే వాటిని నిర్ధారించడం మనకు సాధ్యపడదు. మనం నివసించే భూమి,సూర్యుడు, చంద్రుడు అన్ని కూడా కొన్ని నక్షత్రాల పరిధిలో తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతాయి.

ప్రతీ గ్రహానికి,నక్షతానికి వాటి తాలుకు స్వయంశక్తులు "ప్రభావాలు" కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినపుడు లేదా ఇతర గ్రహాలను కలిసినపుడు తను సంచరించే ప్రాంతంయొక్క,తను కలసిన తోటి గ్రహంయోక్క శుభా శుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి.

astrologer tells about graha gochar

అంటే గ్రహం తన నిర్ధిష్ట పరిధిలో సంచరించే సమయాలలో తను సంచరించిన ప్రదేశం "నక్షత్రం" తనతో కలసి సంచరించే గ్ర్రహలయొక్క స్థితి,యుతి,దృష్టి,మిత్ర,శత్రు,సమత్వానుగుణంగా జాతకస్థితులను ననుసరించి శుభా శుభలను ప్రదర్శిస్తాయి,దీనినే గోచారం అంటారు.

ఒక వ్యక్తియొక్క జాతక చక్రంలోని గ్రహాలకు ప్రస్తుత సంవత్సరంలో లోని గ్రహాలకు పోలిక,మిత్ర,శత్రు,సమత్వ స్థితి నిర్ణయం సరిచూసి గోచార ఫలితాలను తెలియ జేయడం జరుగుతుంది. పుట్టిన వివరాలు లేని వారికి వ్యవహర నామం అంటే ప్రస్తుతం జాతకుడు ఏ పేరుతో పిలవబడుతున్నాడో ఆపేరు ఆధారంగా గోచార గ్రహఫలితాలను జ్యోతిష పండితులు తేలియ జేస్తారు.

జాతకం లేని వారికి గోచారం అన్వయించడానికి నామనక్షత్ర ప్రాతిపదికతను సమన్వయచేసే విధానాన్ని మనఋషులు ప్రతిపాదించారు.చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో కనిపిస్తుంది. చంద్రుడు సమీపలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రం.

ఈ నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి వాటిని రాసులుగా గుర్తించారు. దీని ఆధారంగా చంద్రుని సమీపంలో ఉన్న నక్షత్రరాసిని జాతకుని రాశిగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒకరాశినుండి ఇకంకొక రాశి మారటానిని సంక్రమణ లేక సంక్రాంతి అంటారు.

సూర్యుడు జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసిలో ప్రవేశిస్తాడు. సంవత్సరాకాలంలో 12 రాసులలో సంచరిస్తాడు. తమిళులు తమ సంవత్సరాన్ని సూర్య సంచారాన్ని అనుసరించి గణిస్తారు. సుర్యుడు మేషంలో ప్రవేశించే రోజు వారికి నూతన సంవత్సర ఆరంభం అవుతుంది. సూరుడు మకరరాశిలో ప్రవేశించినపుడు హిందువులు పెద్ద పండుగగా ఆచరించే సంక్రాంతి పండుగ పర్వదినం.

ఈ ప్రకారంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలైన గ్రహాలు ఛాయా గ్రహాలుగా జ్యోతిష్యశాస్త్రాలలో పిలవబడే రాహువు, కేతువు యొక్క సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. ఇవి కాక తెలుగు, మలయాళ జ్యోతిష్కులు శని గ్రహ ఊపగ్రహాలలో పెద్దదైన మాందిని శని పుత్రునిగా వ్యహరిస్తూ గణనలోకి తీసుకుంటారు. తమిళ జ్యోతిష్యంలో మాంది గణనలోకి తీసుకొనే ఆచారం లేదు. గ్రహాలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసే కాలాన్ని 12 రోజులుగా విభజించి జ్యోతిష్య గణన చేస్తారు. వీటి ఆధారంగా ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలియ జేయడం జరుగుతుంది.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా, యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం), పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about graha gochar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి