ఈ ప్రాజెక్ట్ ల కోసం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విన్నపాలు

నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల విషయంలో ఆయనకు పలు విజ్ఞప్తులు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా తెలంగాణలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించనున్నారు.

పలు జాతీయ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న పీఎం మోదీ

ప్రధాని మోదీ నేడు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో వర్చువల్‌గా పలు జాతీయ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించడానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ రీజినల్ అధికారి కృష్ణప్రసాద్ శనివారం సీఎం నివాసానికి వెళ్లి ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించి రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు కోరనున్నారు.

revanth reddy requests to pm modi over metro 2ndphase rrr and key development projects in telangana

ఈ కీలక ప్రాజెక్ట్ లపై మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ రెండవ దశ నిర్మాణానికి కేంద్ర సహకారం, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, డ్రై పోర్టు, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, మూసీ నది పునరుజ్జీవనం తో పాటు ఇతర ముఖ్యమైన అభివృద్ధి పనుల పైన, పలు అభివృద్ధి ప్రాజెక్టుల పైన ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయనున్నారు.

కేంద్ర సహకారం కావాలని రేవంత్ వినతులు

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. హైదరాబాదులోని hicc వేదికగా జరగనున్న మోడీ పర్యటన కార్యక్రమంలో నేడు వర్చువల్ గా పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టుల వినతులను ప్రధాని మోడీ ముందు పెట్టనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

తల్లిదండ్రులకు తీపికబురు.. ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఒకేచోట ఉచితవిద్య!
తల్లిదండ్రులకు తీపికబురు.. ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఒకేచోట ఉచితవిద్య!

రానున్న ఎన్నికల నేపధ్యంలో ఆసక్తికరంగా మోదీ పర్యటన

మరి ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణా రాష్ట్రంలో రానున్న మున్సిపల్ కార్పోరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మోదీ పర్యటన తెలంగాణాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+