విజయ్ కేబినెట్ లో తెలుగు బిడ్డ కీర్తన, నాడు TDP గెలుపులో- అక్కడే మలుపు..!!
కీర్తన సంపత్. తమిళనాడు విజయ్ ప్రభుత్వంలో మంత్రి. అతి పిన్న వయస్సులో మంత్రిగా కీర్తన కొత్త రికార్డు నెలకొల్పారు. తెలుగు బిడ్డ అయిన కీర్తన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల వెనుక తన వంతు పాత్ర పోషించారు. మారుతున్న సాంకేతికతను అస్త్రంగా చేసుకొని విజయ్ పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మంత్రి అయ్యారు. విజయ్ ప్రభుత్వం లో ఇప్పుడు కీర్తన కు అప్పగించే శాఖలు.. బాధ్యతల వేళ కీర్తన నేపథ్యం పై చర్చ జరుగుతోంది.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది. విజయ్ కేబినెట్ లో ఏకైక.. యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్ ప్రమాణ స్వీకారం చేసారు. తన పార్టీ నుంచి ఎంతో మంది సామాన్యుల ను అసెంబ్లీకి పంపిన విజయ్.. కీర్తన విషయంలోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడుతున్న కీర్తన సంపత్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతి కీర్తన సంపత్. కీర్తనది విరుద్ నగర్ జిల్లా చత్రరెడ్డియపట్టి. అక్కడే ఆమె డిగ్రీ వరకు చదువుకుంది. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసింది.ఆ తర్వాత డేటా అనలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రశాంత్ కిశోర్ (ఐప్యాక్) బృందంలో చేరారు. గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో తెరవెనుక వ్యూహరచనలో కీలక పాత్ర పోషించారు.

తొలిసారే ఏకంగా మంత్రిగా
2021లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలుపు కోసం ఐ ఫ్యాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. దీంతో నాడు డీఎంకే గెలుపునకు కూడా పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేశారు కీర్తనా సంపత్. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఆమె నాయకత్వం వహించారు. టీడీపి సోషల్ మీడియా లీడ్‌గా పనిచేసి తన పొలిటికల్ కన్సల్టెంట్‌కు ముగింపు పలికారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు లభించింది. అందుకే శివకాశిలో తెలుగులో ప్రసంగించి మరీ తెలుగు ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎందరో నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తనా సంపత్ తన సొంత జిల్లాలోని ప్రజలను ఆకట్టుకొని కొత్త వ్యూహం అమలు చేసారు. వ్యూహకర్తగా పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌తో ఆమె సోషల్ మీడియాను తన ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. కీర్తనా సంపత్ సర్వీస్ గురించి తెలుసుకున్న పలు సంస్థలు సైతం ఆమెతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయి. శివకాశి నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇతర రాజకీయ పార్టీల కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి సక్సెస్ అయ్యారు. భారీ మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో ఏకంగా మంత్రిగా అడుగు పెట్టబోతున్నారు.













Click it and Unblock the Notifications