విజయ్ కు మోదీ అభయం..ఇక నో వర్రీ..!!

తమిళనాడులో విజయ్ శకం మొదలైంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసారు.9 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం వేళ విజయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విజయ్ మహిళలకు ఉచిత బస్సు అమలు పైన తొలి సంతకం చేసారు. ఇక, విజయ్ కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో కీలక సందేశం ఇచ్చారు.

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసారు. తన తొలి ప్రసంగంలో ఉద్వేగానికి లోన య్యారు. తాను ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తానని చెప్పారు. రహస్య ఒప్పందాలు ఉండవని.. మరో పవర్ సెంటర్ ఉండదని తేల్చి చెప్పారు. తనకు పేదరికం తెలుసని చెప్పిన విజయ్.. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైనా శ్వేత పత్రం వెల్లడిస్తానని తెలిపారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు తెలియనవి తెలుసుకుంటానని.. ప్రభుత్వం పైనా అవగాహన పెంచుకుంటానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీని తన సోదరుడుగా విజయ్ అభివర్ణించారు. ఆ తరువాత విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. కాగా.. విజయ్ ప్రమాణ స్వీకారం వేళ ప్రధాని మోదీ అభినందనలతో పాటు కీలక సందేశం ఇచ్చారు.

 విజయ్ కేబినెట్ లో తెలుగు బిడ్డ కీర్తన, నాడు TDP గెలుపులో- అక్కడే మలుపు..!!
విజయ్ కేబినెట్ లో తెలుగు బిడ్డ కీర్తన, నాడు TDP గెలుపులో- అక్కడే మలుపు..!!
pm-modi-congratulates-c-joseph-vijay-on-becoming-tamil-nadu-cm-pledging-collaboration-to-enhance-c

డీఎంకే కు కాంగ్రెస్ వెన్నుపోటు

తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రభుత్వాని కి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. కాగా.. విజయ్ కోసం ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకే కు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అవకాశవాదిగా పేర్కొన్న మోదీ.. పవర్ కోసం దేనికైనా వెనుకాడదని చెప్పుకొచ్చారు. కాగా.. తమిళ నాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్​ తొలి విడత ప్రతరాలపై సంతకం చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై విజయ్‌ తొలి సంతకం చేశారు. తర్వాతయాంటీ డ్రగ్‌ టాస్క్‌ఫోర్స్‌ దస్త్రంపై, మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్త్రంపై మూడో సంతకం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+