Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రావణ శుద్ద పంచమి నాగపంచమి విశిష్టత

ఈ పూజ ఉదయాన్నే చేస్తారు. పువ్వులు మంచిగంధం, పసుపు, వేపుడు బియ్యము, చిక్కుడు గింజలు, వేపిన ఉలవలు. మొదలయినవి పూజాద్రవ్యాలు. కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు, నైవేద్యం ఇవి ఇతర పూజా కృత్యాలు. ఈనాడు ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించడం ఆచారం.

మిగతారోజుల్లో కంటె ఈనాడు ఆహారపదార్థాలు ముతకవిగా వుండేటట్ల జాగ్రత్తపడతారు. పూజాస్థలంలో రోజంతా దీపం వుంచుతారు. పాలు, భక్ష్యాలు కూడా పెట్టి వుంచుతారు. సాయంకాలం తిరిగి పూవుల పూజ, కర్పూరనీరాజనం, దీపారాధన చేస్తారు. భక్ష్యాలు మళ్లీ నైవేద్యం పెడతారు.

astrologer tells about nag panchami

రాత్రి అంతా అక్కడ ఒకటిగాని ఒకటికి ఎక్కువగాని దీపాలు వుంచుతారు. ఆ రాత్రి అంతా భక్తులు ఆడుకుంటూ మేలుకుని వుంటారు. నాటి ఉదయం నాగపూజ ఐన తరువాత ఇంటిలోని స్త్రీలు, పిల్లలు ఒక చోట చేరుతారు. అప్పడు వారిలో పెద్దామె ఈ పండుగ పుట్టుపూర్వోత్తరాలను చెబుతారు.

మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మడు. నాగపంచమి మాహాత్మ్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదనీ, గోతులు తవ్వకూడదనీ, పారతో మన్ను పొడిచి యెత్తకూడదనీ, మొక్కలు మొదలైనవి పీకకూడదనీ, ఏమిూ మంట పెట్టకూడదనీ, రొట్టె మొదలయినవి కాల్చి పక్వం చేయకూడదనీ అతనికి తెలియదు. అందుచేత అతడు మామూలుగా దున్నడానికి పొలం వెళ్లాడు. దున్నడం ప్రారంభించాడు. పొలంలోని ఒక కలుగులో నాగిని (ఆడపాము) పిల్లల్ని దాచింది. దున్నుతూ వుండగా నాగలి కర్రుకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. బయటికి పోయివున్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయివుండటం చూచింది. దీంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకటానికి బయలుదేరింది.

తిరిగి తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్రు మీద రక్తం మరకలు వుండటం చూచింది. అందుతో ఆ పాముకి ఆ బ్రాహ్మడే తన పిల్లల్ని చంపివుంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. కాగా అది నిద్రపోతూ వుండగా ఆ బ్రాహ్మణ్ణి అతని కుటుంబం వారిని అందర్నీ కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ వుంది. ఈ బ్రాహ్మడి కుటుంబాన్నంతా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా! అందుకని అపాము ఆ ఊరికి బయలుదేరింది.

ఆ ఊరు వెళ్లి ఆ పాము ఆ బ్రాహ్మడి కూతురు ఇంటికి వెళ్లేసరికి ఆమె తన ఇంటి గోడ విూద నాగుల్ని చిత్రించి వానిని యథాశక్తిని శాస్తోక్తంగా పూజిస్తోంది. కాగా, అక్కడ వుంచిన నైవేద్యాని ఆరగించడం తోటే ఆనాగినికి తృప్తి, సంతోషం కలిగాయి. అప్పడు ఆ పాము అంతవరకు జరిగిన కథ అంతా కూతురికి చెప్పివేసింది. దీంతో ఆమె తన కుటుంబసభ్యుల్ని బ్రతికించుకునే సాధనం చెప్పమని పామును పరి పరి విధాల ప్రార్థించింది.

అంతట పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారికళేబరాల మీద చల్లమంది. వారు బ్రతుకుతారని చెప్పింది. ఈ లోగా మణిపురంలోనివారు ఆ బ్రాహ్మడు ఎంతసేపటికి లేవకపోవడానికి ఆశ్చర్యపోతూ తలుపు బద్దలుకొట్టి లోపల ప్రవేశించారు.

ఈ సమయంలో ఆ బ్రాహ్మడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మిూద చిలికి వారిని బతికించింది. అప్పడు ఆమె జరిగిన వృత్తాంతమంతా చుట్టాలకు చెప్పి శ్రావణ పంచమినాడు నాగపంచమి వ్రతం చేయమని ఉపదేశించింది.

ఈ కథ చెప్పినంతసేపు ఆ చేతితో కొన్ని అక్షితలు పట్టుకొని వుంటుంది. కథ పూర్తి అయిన తరువాత కథాక్షతలు అందరికీ ఇస్తుంది. సతారా, కొల్లాపూర్ మండలాల్లో ఈనాడు ప్రయివేటు స్కూళ్లు అన్నీ మూసివేస్తారు. పిల్లకాయలకందరకూ స్నానాలు చేయించి మంచిదుస్తులు కట్టబెట్టించి నదీతీరానికి బారులు తీర్పించి పికారు తీసుకుపోతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+