పెళ్ళిలో గౌరీ పూజ ఎందుకు చేస్తారు?: వివాహ బంధం నిలబడాలంటే..!
హైదరాబాద్: పెళ్ళిలో గౌరీ పూజ వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేస్తారు. ఈ ఆచారం ఇంచు మించు దేశమంతటా ఉంటుంది. శ్రీ కృష్ణుడిని ప్రేమించి అతడినే వివాహము చేసుకోవడానికి రుక్మిణీదేవి కూడా గౌరీపూజ చేసింది. అసలు ఈ గౌరీపూజ ఎందుకు చేయాలి ? లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారినో పూజించవచ్చు కదా ?
చెప్పుకోవాలంటే లక్ష్మీదేవి భర్త శ్రీ మహా విష్ణువు. అందం, చందం, అలంకారం, ఐశ్వర్యం ఉన్న మహాప్రభువు. ఆయనతో కాపురం హాయిగా సాగిపోతుంది.
మరి శివుడు అలా కాదు అయన స్మశానంలో నివసించేవాడు.పాములను మెడలో వేసుకుంటాడు. చేతిలో కపాలాన్ని ధరిస్తాడు. చూడడానికేమో భయంకరంగా ఉంటాడు. ఇంత బూడిద తప్ప అయనకు ఐశ్వర్యమేముంది కనుక? ఆయనతో కాపురం చేయడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో ఓపిక ఉండాలి. ఎన్నో అవమానాలు దిగమింగాలి. ఇంకోవైపు అసంతృప్తి చిహ్నలు కనిపించకూడదు, చిరునవ్వు చెరగకూడదు.ఇది ఎప్ఫుడు సాధ్యమౌతుంది? వీటన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించి ఆరాధించినప్పుడే అసలైన గుర్తింపు లభిస్తుంది.

వివాహానికి ముందు అమ్మాయిలు.. ఆ తర్వాత..
వివాహానికి ముందు తర్వాత అడపిల్లల అనుభవం చూడండి.పెళ్ళంటే అమ్మయిలకు అంతకు ముందు అసలు పరిచయం లేని ఒకకొత్త వ్యక్తితో బంధం ముడిపడి తన జీవితమంతా అతనితోనే సహవాసం చేయాలి. చాలా మంది పెళ్ళంటే ఏన్నో కలలు కంటారు. కానీ తను కలగన్న రాకుమారుడు జోడిగా రాకపోవచ్చు తాను కోరుకున్నంత సంపన్నడు కాకపోవచ్చు కానీ తన జీవితం అతనితోనే ముడిపడిపోతుంది.

వివాహ జీవితంలో కలతలు రాకుండా..
వివాహ బంధాలు అనేవి మనకు స్వర్గంలో నిర్ణయమవుతాయని సామెత. నిజానికి ఈ సూత్రం మన దేశానికీ, మన వివాహ వ్యవస్థకే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది. భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు ఉన్న కేవలం ప్రేమ మాత్రమే వీటిని జయించగలుగుతుంది. అందుకు ఆదర్శం సతీదేవి. కన్నతండ్రి దక్షుడు, తన భర్త రూపు రేఖలను,దరిద్రాన్ని ఎత్తి చూపించి దూషించినప్పుడు భరించలేక సతీదేవిగా అగ్నిప్రవేశం మమేకభావమే అటువంటి గౌరీ దేవిని గుర్తు చేసుకుంటే వివాహా జీవితంలో కలతలు,ఇబ్బందులు రావు,సంసారం స్వర్గతుల్యం అవుతుంది.

గౌరీ, విష్ణువు ప్రతీరూపంగా..
పెళ్ళకి ముందు ఆడపిల్లలచేత గౌరీపూజ చేయించడానికి కారణం అందుకే.ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్య స్వరూపంగా విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.

స్వాగతం పలుకే వేడుక
పెళ్ళికూతురునకు నలుగు స్నానం చేయించి పెళ్ళి కూతురుగా అలంకరణచేసి పెళ్ళిబొట్టు పెట్టి పాదాలకు పారాణిని పూసి పూల జడ వేసి కొత్త బట్టలను కట్టించి (పట్టుచీర)ను "గౌరీ పూజ" కు తీసుకువెలుతారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో పానకం బిందెలతో కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరునకు ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరకు ఇస్తారు.

వరపూజ...గౌరీ పూజ
వరపూజలో భాగంగా ఆడపెళ్ళి వారు వారి వైపు బంధువులు వచ్చి వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వానిస్తారు.వరపూజలోనే ఇరువైపువారు ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే కన్యా దాత ఇంట్లో వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

బహ్మచర్యాన్ని వదిలి..
ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రామాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురువెల్లి నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లమని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది.
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.












Click it and Unblock the Notifications