వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందంతోపాటు ఆరోగ్యం: కాళ్ళకు పారాణి ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: పసుపుతో పాటు పాదాల అలంకారానికి వాడేది పారాణి. పసుపు సున్నం నీరు కలిపితే వస్తుంది చక్కని ఎర్రని పారాణి. బాగా పల్చగా ఉంటే దీనిని వసంతం అంటారు. పూర్వం వసంతం అడటానికి పిచికారి గొట్టంలో ఈ ఎర్రని ద్రవాన్నే పోసే వారు. ఈ రంగులు సహజమైనవి కనుక ప్రమాదకారులు కావు. ప్రమోదకారులు మాత్రమే.ఆహ్లాద కరంగా ఉండటమే కాదు త్వరగా పోతాయి కూడాను.

ఆరోగ్యం చెడకుండా..

ఆరోగ్యం చెడకుండా..

దిష్టి తియ్యటానికి ముఖ్యంగా శుభ సందర్భాలలో పారాణి నీటిని [ఎర్ర నీళ్ళు అంటారు] ఉపయోగిస్తారు. ఆడవారు కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం పారాణి ముద్దని మింగటం కాని పారాణి నీటిని తాగటం కాని చేస్తారు. ఇది ఆరోగ్యం చెడకుండా ప్రమాదాలు రాకుండా ఉండే సురక్షిత మార్గం.

దివ్య ఔషధం..

దివ్య ఔషధం..

పసుపులో సున్నం కలపటం వల్ల ఇది పసుపు కన్నా తీవ్రమైన క్రిమి సంహారకం, ఘాటుగా ఉంటుంది. అందుకనే గోరు చుట్టు వస్తే పారాణి ముద్దని గోరింటాకు లాగా పెట్టి కట్టు కడతారు. పిప్పి గోళ్ళకి, పుచ్చు గోళ్ళకి ఇది దివ్యమైన ఔషధం. ఈ ఆరోగ్య రహస్యాలు తెలిసినా తెలియక పోయినా అన్నీ శుభకార్యాలలో కాళ్ళకి పారాణి పెట్టే సంప్రదాయం ఈ నాటికీ కొనసాగుతోంది.

వధువుకే కాదు.. వరుడికి కూడా..

వధువుకే కాదు.. వరుడికి కూడా..

ఇది ఆడవారికి సంబంధించింది అనుకుంటాం. కాని ఇది అందరికి వర్తించే సంప్రదాయం. కనుకనే పెళ్లిళ్లు, వడుగులు మొదలైన సందర్భాలలో పెళ్లి కొడుకుకి పసుపు రాసి పారాణి పెడతారు. పసుపు పారాణి మంగళ ద్రవ్యాలు. ఐదోతనానికి చిహ్నాలు.

ప్రత్యేకమైన పూజలు చేసేప్పుడు పూజ చేసే వారూ వారి చేత ముత్తైదువలుగా పూజింప బడే వారూ పాదాలకి పసుపు పారాణి విధిగా అలంకరించుకోవలసి ఉంటుంది.

అందంతోపాటు ఆరోగ్యం..

అందంతోపాటు ఆరోగ్యం..

నూతన వధువు అని చెప్పటానికి కాళ్ల పారాణి తడి ఆరలేదు అని ఆలంకారికంగా చెప్పటం వివాహానికి పారాణికి ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచించటానికే పచ్చని పసుపు మీద ఎర్రని పారాణి గీతలు పాదానికి ఎంతటి అందాన్ని కలిగిస్తాయి, అందంతో పాటు ఆరోగ్యం.అప్పుడప్పుడు పారాణి పెట్టుకోవటం కాలి గోళ్ళ ఆరోగ్యానికి మంచిది.

English summary
astrologer told the story about Parani effects on health
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X