వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: మీకు నాగ దోషం ఉందా.. అయితే ఈ పని చేయండి చాలు..!

|
Google Oneindia TeluguNews

చాలా మందికి నాగ దోషం ఉంటుంది. ఈ దోషం ఉండడం వల్ల పెళ్లిలు జరగువు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని జ్యోతష్య నిపుణులు చెబుతున్నారు. ఈ నాగ దోషం ఉన్నవారు పూర్వజన్మలోపాములను చంపినవారు లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు ఉంటారట. అలాగే పుట్టలను తవ్వినవారు. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు. నాగ దోషం ఉంటుంది.

సంతానం

సంతానం

ఈ దోషం ఉన్నవారు సంతానం, కుటుంబం, అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నాగదోషం ఉంటే వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుందట. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారని జ్యోతిష్యులు వివరిస్తున్నారు.

నాగ దేవతా ప్రతిష్టాపన

నాగ దేవతా ప్రతిష్టాపన

జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుందట. ఈ దోషం పోవాలంటే.. నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే మంచిదట. అలాగే శివుడిని ఆరాధించడం, దోష నివారణకు చర్యలు తీసుకోవడం, నవనాగ స్తోత్రాన్ని నిరంతరం పారాయణం చేయడం మంచిదట.

శుభతిథులు

శుభతిథులు

నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయట పడవచ్చుని జ్యోతిష్యులు చెబుతున్నారు. నాగులకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టం.అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణ పక్షము నాగపూజకు అనువైన శుభదినాలుగా ఉంటాయట.

రాహుకేతువు పూజ

రాహుకేతువు పూజ

కానాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వహిస్తే మంచి జరుగుతుందట. నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజ చేసుకోవాలట.

Note: ఈ వార్త కేవలం జ్యోతిష్యుల అభిప్రాయాల ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని వన్ ఇండియా ధృవీకరించలేదు.

English summary
Many people have naga dosha. Astrologers say that due to the presence of this dosha, marriages will not take place and there will be many difficulties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X