శివరాత్రి తర్వాత సూర్య గ్రహణంతో ఈ రాశుల పంట పండుతోంది
ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజు మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. సరిగ్గా పండగ అయిపోయిన రెండురోజుల తర్వాత 17వ తేదీన సూర్య గ్రహణం సంభవిస్తుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది. మనదేశంలో కనిపించకపోయినప్పటికీ ఇతర దేశాలపై ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. 2026లో ఏర్పడుతున్న మొదటి సూర్య గ్రహణానికి సూతక కాలం చెల్లదు. ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏయే రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే వివరాలను తెలుసుకుందాం.
తులారాశి
కొత్త ఉద్యోగాలు పొందుతారు. వీరికి అద్భుతమైన అవకాశాలు చేతికి వస్తాయి. ఆస్తుల పరంగా కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా జరిగే పెద్ద పెద్ద ప్రమాదాల బారినుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. డబ్బును కూడా భారీగా పొందుతారు. ఆధ్యాత్మిక వాతావరణంవైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు.

ధనస్సు రాశి
సులభంగా డబ్బు సంపాదించాలనుకునేవారికి ఈ సమయం మంచి మంచి అవకాశాలను కల్పిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు కూడా ముందడుగు వేస్తారు. ఇది అనుకూలంగా ఉండే సమయం. ఇంటితోపాటు కొత్తగా వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఇల్లు లేదంటే స్థలాన్ని లేదంటే వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథున రాశి
ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. ఖర్చులు కూడా తగ్గుతాయి. కొత్తగా ప్రణాళికలు రచించుకొని విజయాలు అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఉంటేకనుక వాటి నుంచి ఈ సమయంలో రాబడి మొదలవుతుంది.
సింహరాశి
ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారస్తులు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. డబ్బు పరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నీ సానుకూలంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications