Astrology: పితృపక్షాల సమయంలో కలల్లో పూర్వీకులు..ఎలా వస్తే శుభం? ఎలా వస్తే అశుభం?

మనిషి జీవితంపై కలల ప్రభావం ఉంటుందా? జ్యోతిష్య శాస్త్రం కలల గురించి ఏమి చెప్తుంది? పురాతన కాలం నుండి, కలలు భవిష్యత్ సంఘటనలకు సంబంధించినవిగా కనిపిస్తాయి. చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక పితృ పక్షాల సమయంలో పూర్వీకులు మన కలలలోకి రావటం వెనుక కూడా ఎన్నో అర్ధాలు ఉంటాయి.

కలలోకి పూర్వీకులు ఎలా వస్తే శుభం? ఎలా వస్తే అశుభం?

కలలోకి పూర్వీకులు ఎలా వస్తే శుభం? ఎలా వస్తే అశుభం?

పితృ పక్షాలు ఈ నెల సెప్టెంబర్ 10వ తేదీన మొదలై సెప్టెంబర్ 25 వ తేదీ వరకు, మహాలయ అమావాస్య వరకు ఉంటాయి. పితృ పక్షాల సమయంలో ప్రతి ఒక్కరు తమ పూర్వీకులను స్మరించుకునే విషయం తెలిసిందే. ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం పితృపక్షం భాద్రపద మాసం పౌర్ణమి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. పితృ పక్ష సమయంలో భూమి మీదకి పూర్వీకులు తమ వారిని ఆశీర్వదించడం కోసం వస్తారని నమ్ముతారు.

వారికి ఇష్టమైన ఈ పదిహేను రోజులు సమయంలో పూర్వీకులు మీ కలలోకి వస్తే, ఆ కలలకు కూడా ఒక అర్థం ఉందని చెబుతున్నారు. కలలోకి పూర్వీకులు ఎలా వస్తే శుభం కలుగుతుంది. ఎలా వస్తే అశుభంగా పరిగణించబడుతుంది వంటి వివరాలను తెలుసుకుందాం.

మరణించిన పెద్దలకు ఇష్టమైన దినాలు పితృపక్షం దినాలు

మరణించిన పెద్దలకు ఇష్టమైన దినాలు పితృపక్షం దినాలు

సెప్టెంబరు 10వ తేదీ నుండి పితృ పక్షం 2022 చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించే రోజు ప్రారంభమవుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ పక్షంలో పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి పిండదానం, శ్రాద్ధం మరియు తర్పణం మొదలైనవి చేస్తారు. ఈ హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం, పితృ పక్షం నాడు, పూర్వీకులు భూమిపైకి వచ్చి వారి వారసులను ఆశీర్వదిస్తారని, అందుకే వారికి కావాల్సిన శ్రాద్ధకర్మలను నిర్వర్తిస్తారు. ఇక ఈ సమయంలో వారు కలలోకి కూడా వస్తూ ఉంటారు.

 పూర్వీకులు వారసుల కలలోకి వచ్చేది అందుకే

పూర్వీకులు వారసుల కలలోకి వచ్చేది అందుకే

ఎవరి కోరికలు నెరవేరకుండా మరణిస్తారో, ఆ వ్యక్తులు వారి వారసుల కలలోకి వస్తారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, పూర్వీకుల కోరికలు నెరవేరే వరకు, వారి ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. అందువల్ల, వారి కోరికల నెరవేర్పు కోసం, పూర్వీకులు తమ వారసుల కలలలోకి వస్తారు. కలలో పూర్వీకులు ఎలా కనిపిస్తారో దానిని బట్టి వారు సంతోషంగా ఉన్నారా బాధతో ఉన్నారా అనేది తెలుస్తుంది. వారు ఉన్న పరిస్థితిని బట్టి మనం సుఖంగా ఉంటామా? లేక అశుభం జరుగుతుందా అనేది కూడా సూచనప్రాయంగా తెలుస్తుంది.

కలలో పూర్వీకులు నవ్వడం శుభ సంకేతమా?

కలలో పూర్వీకులు నవ్వడం శుభ సంకేతమా?

కలలో పూర్వీకులు నవ్వడం మీరు చూస్తే, అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. పూర్వీకులు తమ వారసులతో సంతృప్తిగా మరియు సంతోషంగా ఉన్నప్పుడు, అలాంటి కలలు కనిపిస్తాయని నమ్ముతారు. చనిపోయిన వ్యక్తులు ఆశీర్వదించినట్టుగా కలలు కంటే అన్ని రకాల శుభాలు జరుగుతాయని, ఎక్కువ కాలం జీవిస్తాం అని అర్థం.

పూర్వీకులతో కలిసి భోజనం చేయడం వంటి కలలు కనడం మంచిదేనా?

పూర్వీకులతో కలిసి భోజనం చేయడం వంటి కలలు కనడం మంచిదేనా?

ఇక పూర్వీకులతో కలిసి భోజనం చేసినట్లు కల వస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం. మరణించిన తండ్రి కలలో కనిపిస్తే మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారని, మరణించిన తల్లి కలలో కనిపిస్తే కుటుంబంలో ఎవరైనా ఆడపిల్లకు జన్మనిస్తారని అర్థం. ఇక పూర్వీకులతో మాట్లాడుతున్నట్టు కలలు కంటే పేరు, కీర్తి మీకు వస్తుంది అని అర్థం. ఇంట్లో చనిపోయినవారు నిదురిస్తున్నట్లుగా కల వస్తే మీరు అతి పెద్ద ప్రమాదం నుండి బయట పడుతున్నారు అని అర్థం.

పూర్వీకులు కలలో ఏడుస్తూ కనిపిస్తే అది దేనికి సంకేతం?

పూర్వీకులు కలలో ఏడుస్తూ కనిపిస్తే అది దేనికి సంకేతం?

పూర్వీకులు కలలో ఏడుస్తూ ఉండటం అశుభం. కలలో పూర్వీకులు ఏడుస్తూ ఉండటం పెద్ద సంక్షోభానికి నిదర్శనమని, అలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా, పూర్వీకుల సంతృప్తి కోసం పిండదానం, శ్రాద్ధ తర్పణం వంటివి చేయాలని చెబుతారు. ఇక ఇదే సమయంలో ఆలయాలకు వెళ్లి పూజాదికాలు నిర్వహించడం కూడా కొంతమేర జరగబోతున్న ఉపద్రవాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+