వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

astrology: చుక్కల అమావాస్య చాలా పవర్ ఫుల్; దరిద్రం పోవాలంటే ఇలా చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

తెలుగు నెలలలో నాలుగో నెల అయిన ఆషాఢమాసానికి తనదైన ప్రత్యేకత ఉంది. ఈ రోజుతో ముగుస్తున్న ఆషాఢ మాసం దానధర్మాలకు ప్రతీతి. ఆషాడమాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. అటువంటి చుక్కల అమావాస్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక నేడు చుక్కల అమావాస్య సందర్భంగా, చుక్కల అమావాస్య కున్న ప్రత్యేకతలు తెలుసుకుందాం. అంతేకాదు చుక్కల అమావాస్య నాడు సాయంత్రం ఆపని చేస్తే దరిద్రం మాయం అవుతుందట.

astrology: ఇంటిముందు కుక్కలు ఏడిస్తే దేనికి సంకేతం? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?astrology: ఇంటిముందు కుక్కలు ఏడిస్తే దేనికి సంకేతం? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

చుక్కల అమావాస్య నాడు చెయ్యాల్సిన పూజలు ఇవే

చుక్కల అమావాస్య నాడు చెయ్యాల్సిన పూజలు ఇవే


చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఇది దక్షిణాయణ పుణ్య కాలం. ఈ దక్షిణాయణ పుణ్య కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని పెద్దలు చెబుతారు. అందుకనే దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అందుకే చుక్కల అమావాస్యకు అంతటి ప్రాధాన్యత. చుక్కల అమావాస్య నాడు పెద్ద నిన్ను తలుచుకుంటూ దానధర్మాలు చేస్తే పెద్ద ఆత్మ శాంతిస్తుంది అని చెబుతుంటారు.

పెళ్ళికాని అమ్మాయిలు గౌరీపూజ చేస్తే మంచి భర్త దొరుకుతాడు

పెళ్ళికాని అమ్మాయిలు గౌరీపూజ చేస్తే మంచి భర్త దొరుకుతాడు


అంతేకాదు చుక్కల అమావాస్య నాడు పెళ్లి కానీ అమ్మాయిలు గౌరీ పూజలు చేస్తే, మంచి వరుడు దొరుకుతాడు అని, త్వరగా వివాహం జరుగుతుందని చెబుతారు. చుక్కల అమావాస్య రోజు గౌరీ పూజ చేసి, సాయంత్రం వరకు నిష్టగా ఉపవాసం ఆచరించి చుక్కల అమావాస్య నోమును నోచి బంగారపు చుక్కలను దానం చేసే ఆనవాయితీ ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఉంది. అయితే ఈ నోమును కొత్త కోడళ్ళు మాత్రమే చేస్తుంటారు. అలా చేయడం వల్ల వారి మాంగల్యబంధం దృఢంగా ఉంటుందని నమ్ముతారు.

చుక్కల అమావాస్య నాడు దీప పూజలు .. అందుకే

చుక్కల అమావాస్య నాడు దీప పూజలు .. అందుకే


ఇక చుక్కల అమావాస్య నాడు దీప పూజలను నిర్వహిస్తారు. చక్కగా అలికి ముగ్గు పెట్టి, పీట లను ఏర్పాటు చేసి ఆ పీటల పైన ముగ్గులు వేసి దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. ఇలా దీపాలను వెలిగించడం వల్ల మన జీవితం లో ఉన్న చీకట్లు తొలగి పోయి వెలుగులు నిండుతాయి అని పెద్దలు విశ్వసిస్తారు. అందుకే చుక్కల అమావాస్య నాడు దివ్య మైన దీప పూజలను చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు.

నిమ్మకాయలతో సాయంత్రం ఇలా చేస్తే నరదృష్టి మాయం

నిమ్మకాయలతో సాయంత్రం ఇలా చేస్తే నరదృష్టి మాయం


ఇక చుక్కల అమావాస్యనాడు నిమ్మ కాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది. ఇక చుక్కల అమావాస్యనాడు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కలనుంచి పసుపు, కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం కావడంతో పాటుగా, నరదృష్టి మాయమవుతుంది. పట్టిపీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
chukkala Amavasya has many special features. To get rid of poverty today, the elders said that the remedy should be done in the evening with lemons, salt, turmeric and saffron.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X