మాలవీయ రాజయోగంతో ఈ రాశుల సుడి తిరుగుతోంది
జ్యోతిష్యం ప్రకారం వచ్చే నెలలో ఐశ్వర్యానికి, కళలకు కారకుడయ్యే రాక్షసుల గురువు శుక్రుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు కలిసి మీనరాశిలో సంయోగం చెందుతున్నారు. అలాగే మార్చి 15వ తేదీన గ్రహాలకు అధిపతి సూర్యుడు కూడా ఇదే రాశిలోకి వస్తున్నాడు. ఇలా మూడు గ్రహాల కలయికతో రంగుల పండగైన హోలీకి ముందు మాలవీయ రాజయోగం ఏర్పడుతోంది. కొన్ని రాశులకు ఇది ఎంతో శుభప్రదం. అలాగే శుక్రుడు హోలీకి ముందు తన రాశిని మార్చుకుంటున్నాడు. ఇటువంటి పరిణామాలన్నీ కలిసి ఏ రాశులకు అదృష్టాన్ని మోసుకొస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కుంభరాశి
కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.మీ సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ వ్యాపారం చేసేవారికి, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి
గతంలో మీరు పెట్టుబడి పెట్టివుంటే ఈ సమయంలో వాటి నుంచి భారీ లాభాలను స్వీకరిస్తారు. మీకు విలావసంతమైన జీవితం లభించబోతోంది. సుఖాలకు అలవాటుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించి రాణిస్తారు. మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సంపదను, శ్రేయస్సును పెంచుకొని సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. కొత్తగా ఆదాయం పొందడానికి వనరులు దొరుకుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. సామాజికంగా సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. తల్లిదండ్రులవైపు నుంచి, భార్య వైపు నుంచి ఆస్తులు కలిసివచ్చే అవకాశం ఉంది. వారి నుంచి మద్దతు దొరుకుతుంది. వ్యాపారాన్ని బాగా వృద్ధిలోకి తెస్తారు.
వృశ్చిక రాశి
ఆర్థికంగా మీ పరిస్థితిని ఇది మెరుగుపరుస్తుంది. సానుకూల ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతిలోకి వెళతారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. గతంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.












Click it and Unblock the Notifications