vastu tips: ఆర్ధిక ఇబ్బందులు.. అనారోగ్యాలు.. కుంకుమతో పరిహారాలు చేస్తే దూరం!!
ఇంట్లో ఎంత వాస్తు నియమాలను పాటించినా, వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకున్నా మనకు తెలిసి తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల వాస్తు దోషాలు తలెత్తుతాయి. దీనివల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను, చిరాకులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి కుంకుమతో కొన్ని పరిహారాలు చేస్తే మంచిఫలితం ఉంటుందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
వాస్తు శాస్త్రం ప్రకారం కుంకుమ ఇంటికి శ్రేయస్సును కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు, ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిలో చిటికెడు కుంకుమ కలిపి, సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. తూర్పు వైపున తిరిగి సూర్య భగవానుడిని చూసి, ఆరోగ్యం సమర్పించి మనస్ఫూర్తిగా సూర్యుని పూజిస్తే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు.

ఫలితంగా సూర్యుడు ఆశీస్సులు వారి పైన కచ్చితంగా ఉంటాయి. వారి ఆర్థిక సంక్షోభం దూరం అవడమే కాకుండా, ప్రశాంత జీవనాన్ని సాగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నవారు జాస్మిన్ ఆయిల్లో కుంకుమను కలిపి ఐదు వారాలపాటు హనుమంతుడికి సమర్పించాలి. హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం నాడు ఐదు వారాలు జాస్మిన్ ఆయిల్ లో సింధూరం ని కలిపి హనుమంతునికి సమర్పిస్తే కచ్చితంగా ఆయన దయ వారిపై ఉంటుంది.
హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి, ఎర్రటి సింధూరాన్ని హనుమంతునికి నివేదించాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడమే కాకుండా ఉద్యోగ వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది. డబ్బులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి, ప్రవహించే నీళ్లలో కలపాలి.
ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఫలితంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే బుధవారం నాడు వినాయకుడికి కుంకుమను సమర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారానికి కూడా పసుపుతో పాటు కుంకుమను పూసి పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఆనందము మరియు శ్రేయస్సు వెల్లి విరుస్తుంది.
అంతేకాదు పెళ్లి అయిన స్త్రీలు తల స్నానం చేసి పార్వతి దేవికి కుంకుమను సమర్పించి పూజిస్తే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు పూజ గదిలో పసుపుతో పాటు కుంకుమను ఉపయోగించడం వల్ల కూడా ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications