astrology: ఇంట్లో తెలీక చేసే ఈ తప్పులతో కొంప కొల్లేరేనట.. తెలుసుకోండి!!
ఇంటి నిర్మించుకోవడానికి వాస్తు ఏ విధంగా అవసరమో, అదేవిధంగా ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం కోసం కూడా వాస్తు నియమాలు ఉంటాయని తెలుసుకున్నాం. అదే సమయంలో ఇంట్లో ఉండే వ్యక్తులు చేయవలసిన, చేయకూడని పనులను గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇంట్లో కొన్ని మనకు తెలియకుండా చేసే పనులు అశుభాలను తీసుకువస్తాయి. అవి మనకు తెలియకుండానే వాస్తు దోషాలను కలిగిస్తాయి.

రాత్రితలస్నానం చేసి, జుట్టు విరబోసుకుంటున్నారా? అయితే జాగ్రత్త
ఇక అటువంటి పనులలో రాత్రిపూట తలస్నానం చేయడం ఒకటి. పొరపాటున కూడా ఎవరూ రాత్రిపూట తలస్నానం చేయకూడదు. కొందరికి నట్టింట్లో తల దువ్వే అలవాటు ఉంటుంది. ఇది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. అంతేకాదు కొంతమంది చిక్కు తీసిన వెంట్రుకలను ఆ మూల మూల దాస్తూ ఉంటారు. అలా చేయడం కూడా మంచిది కాదని సూచించబడింది. రాత్రి జుట్టు విరబోసుకుని పడుకోవడం కూడా మంచిది కాదంటున్నారు. అలా చేస్తే ప్రతికూల శక్తులకు ఆహ్వానం పలికినట్టు అంటున్నారు.

ఈ రోజుల్లో ఈ పనులు చెయ్యకండి
ఇక ఇంట్లో మంగళ, శుక్రవారాలలో బూజు దులిపే పని కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇక శనివారం నాడు పొరపాటున కూడా నువ్వులు, చెప్పులు, గుడ్లు, ఉప్పు, మిరియాలు కొని ఇంటికి తీసుకు రాకూడదు. ఇవి మనకు దురదృష్టాన్ని తెస్తాయి, అంతేకాదు శుక్రవారం నాడు మీ చేతితో ఎవరికీ మిరియాలు, పెరుగు, ఉప్పు ఇవ్వకూడదు. ఇంట్లో పగిలి పోయిన వస్తువులు ఉంచుకోకూడదు. బాగా దుమ్ము పట్టిన వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేదంటే అది కూడా అశుభ సంకేతం గా మారుతుంది.

సాయంత్రం 6 తర్వాత పొరబాటున కూడా వీటిని తెచ్చుకోకండి
సాయంత్రం ఆరు గంటల తర్వాత పొరపాటున కూడా బట్టలు కుట్టే సూది, ఉప్పు, గుడ్లు ఇంటికి తీసుకురాకండి. ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేయడం, ఆహారం ఇష్టారాజ్యంగా వృధా చేయడం, పాడైపోయిన పచ్చళ్ళు, ఆహారాన్ని దాచి పెట్టుకోవడం చెయ్యకూడదు అని చెబుతున్నారు. ఇంటి గడప మీద కూర్చోవడం,అంతేకాదు శనివారంనాడు పొరపాటున కూడా ఎవరి వద్ద నుండి ఉప్పు, మిరియాలు, నువ్వులు తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు.

మహిళలు ఇలా ఉంటే అరిష్టం
ఇక మహిళలు ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం అశుభ సూచకంగా చెబుతున్నారు. మహిళలు బొట్టు లేకుండా ఎప్పుడూ తిరగటం మంచిది కాదని అంటున్నారు. మహిళలు అలా ఉంటే అరిష్టం అని చెప్తున్నారు. చీపుర్లు, చాటలు, డస్ట్ బిన్ లు వంటగదిలో ఉంచకూడదు అని చెప్తున్నారు. ఇక ఈ ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకొని ఇంటి వాతావరణానికి హాని కలిగించే, ప్రతికూల ఫలితాలను ఇచ్చే పనులు చేయకుండా ఉంటే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications