Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

astrology: అక్టోబర్ నెలలో పుట్టిన వారిలో సూపర్ క్వాలిటీస్.. వారి జీవిత లక్ష్యం ఇదే!!

మనం పుట్టిన నెల మన జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఒక్కొక్క నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఒక్కో విధంగా ఉంటుంది. పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని కొంత మేరకు అంచనా వేయవచ్చు. ఇక అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది. వారిలో ఉండే సూపర్ క్వాలిటీస్ ఏమిటి వంటి అనేక వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అక్టోబర్ లో పుట్టిన వారు నిజాయితీపరులు

అక్టోబర్ లో పుట్టిన వారు నిజాయితీపరులు

అక్టోబర్ నెలలో పుట్టిన వ్యక్తులు నిజాయితీపరులుగా ఉంటారు. ఎప్పుడూ సత్యానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వారు నిజాయితీని వదులుకోరు. అవతలి వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా, లేక మోసం చేస్తున్నాడు అనే అంశాలను గుర్తించడంలో వారు నేర్పరులు గా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో, అవతలి వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తారు. అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు.

ప్రశాంతంగా జీవించాలన్నదే వీరి లక్ష్యం

ప్రశాంతంగా జీవించాలన్నదే వీరి లక్ష్యం

ఇక అక్టోబర్ నెలలో పుట్టిన వారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. ఎక్కువ టెన్షన్ లు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వారి జీవితంలో శాంతిని కొనసాగించడానికి, తమ చుట్టూ ఉన్న వారితో సఖ్యంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా విభేదాలు పెట్టుకోవడం, చిరాకు పడడం అక్టోబర్ మాసం లో పుట్టిన వారికి ఇష్టం ఉండదు. మీరు ఎవరితోనైనా ఆరోగ్యకరమైన, సామరస్యపూర్వకమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎటువంటి విషయాలను కాంప్లికేట్ చేయరు. సందర్భానుసారంగా ప్రవర్తిస్తారు.

 జీవిత భాగస్వామి పై స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తారు

జీవిత భాగస్వామి పై స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తారు

ఇక అక్టోబర్ మాసం లో పుట్టిన వారు చాలా ప్రేమను కలిగి ఉంటారు. వీరిలో ఉండే రొమాంటిక్ కోణం జీవిత భాగస్వామి ని ఎప్పుడూ ఎట్రాక్ట్ చేస్తుంది. అక్టోబర్ మాసం లో పుట్టిన వారు శృంగార భరితంగా ఉండటంతోపాటు, జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఎలా మలచుకోవాలో తెలుసుకున్న వారై ఉంటారు. వారి జీవితంలో ప్రేమ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. జీవిత భాగస్వామిని ప్రేమించే విషయంలో చాలా స్వచ్ఛంగా ఉంటారు.

సృజనాత్మక లక్షణాలు వారి సొంతం

సృజనాత్మక లక్షణాలు వారి సొంతం

ఇక అక్టోబర్ మాసం లో పుట్టిన వారు సృజనాత్మక లక్షణాలను కలిగి ఉంటారు. వారిని మేధావి అని చాలామంది కచ్చితంగా అంగీకరించి తీరుతారు. చాలా సందర్భాలలో వారి సృజనాత్మకత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్టోబర్ మాసం లో పుట్టిన వారికి వస్తువులను ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో, వాటికి పర్సనల్ టచ్ ఏ విధంగా ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు. వారి ప్రతి వస్తువులోనూ ఉత్తమంగా ఉన్నవాటినే ఎంచుకుంటారు. వారు సృష్టించే వస్తువులను కూడా బెస్ట్ అనేవే సృష్టిస్తారు.

చాలా ఎమోషనల్.. కానీ బయటకు ప్రశాంతంగా

చాలా ఎమోషనల్.. కానీ బయటకు ప్రశాంతంగా

అక్టోబర్ లో పుట్టిన వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అదే సమయంలో వారి భావోద్వేగాన్ని బయటకు రానివ్వకుండా ప్రశాంతమైన వ్యక్తులుగా కనిపిస్తారు. వీరు తమ చుట్టూ ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇతరుల బాధల పట్ల జాలి కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఇదే సమయంలో తన భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని ఇతరులు తమను ఉపయోగించుకోకుండా చూసుకునేంత తెలివైన వారుగా ఉంటారు.

ఆశావాదులు.. సవాళ్ళను స్వీకరిస్తారు

ఆశావాదులు.. సవాళ్ళను స్వీకరిస్తారు

అక్టోబర్ మాసం లో పుట్టిన వారు సవాళ్లను స్వీకరించడానికి వాటిని సాధించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించరు. వారు తమ బెస్ట్ ఇవ్వడం కోసం, తమ వద్ద ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటారు. జీవితంలో వచ్చే సమస్యలకు, సవాళ్లకు ఎప్పుడూ భయపడకుండా ముందుకు సాగుతారు. అక్టోబర్ మాసంలో పుట్టిన వారు ఆశావాదులు. బాధలు ఎప్పటికీ ఉండవని, పరిస్థితులు చక్కబడతాయి అని విశ్వసించేవారు. ఎటువంటి కఠినమైన పరిస్థితులు అయినా నిరాశకు గురి కారు. ఒకవేళ ఏదైనా ప్రయత్నంలో విఫలమైనా, విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వారు అనుకున్న లక్ష్యాలను చేరడానికి, వారి కలలను నెరవేర్చుకోవడానికి మొండిగా కష్టపడతారు.

అక్టోబర్ మాసంలో పుట్టిన వారి మొదటి ప్రాధాన్యత కుటుంబం

అక్టోబర్ మాసంలో పుట్టిన వారి మొదటి ప్రాధాన్యత కుటుంబం

అక్టోబర్ మాసం లో పుట్టిన వారికి మొదటి ప్రాధాన్యత కుటుంబం. కుటుంబం వీరి జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. వీరు కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగిస్తారు. కుటుంబానికి షరతులు లేని ప్రేమను, ఆప్యాయతను అందిస్తారు. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడం లో వారి నిజాయితీ, పరస్పర గౌరవం ప్రశంసనీయం. అక్టోబర్ మాసం లో పుట్టిన వారు ఖర్చు విషయంలో ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటారు. బ్రాండెడ్ బట్టలు, బూట్లు, ఇతర వస్తువులపై ఖర్చు చేయడం వారికి అలవాటు. ఒక్కొక్కసారి డబ్బులు బాగా ఉంటే విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తమకు అవసరం లేకున్నా కూడా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి డబ్బులు ఖర్చు చేసే విషయంలో చాలా ఆచితూచి ప్రవర్తిస్తారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+