కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది
జ్యోతిష్యం ప్రకారం మార్చి నెలలో కీలక గ్రహాల సంచారం ఉంది. మీన రాశిలో కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. సంపదకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇలా ఈ రెండు కీలక గ్రహాలు కలుసుకోవడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. శుక్రుడు రాశిని మార్చినప్పుడల్లా ఇతర రాశులకు కీలక ప్రభావాన్ని చూపుతాడు. ఈ యోగంతో ఏ రాశులకు ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
ఉద్యోగులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారు మంచి ఫలితాలను అందుకుంటారు. వారికి మంచి లాభాలున్నాయి. వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలను గడిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణానికి మొగ్గుచూపుతారు.

ధనుస్సు రాశి
వీరికి కేంద్ర త్రికోణ రాజయోగం ఆత్మవిశ్వాసాన్ని పెంచుుంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. అలాగే వాహనం కొనుగోలుకు కూడా అవకాశాలున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం మీరు కోరుకున్నరీతిలో జరుగుతుంది. దీర్ఘకాలికంగా మీకున్న కోరికలన్నీ ఈ సమయంలో నెరవేరతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్థులకు అంతా అనుకూలంగా ఉంది.
మేష రాశి
విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. అధిక సమయాన్ని వారికి కేటాయిస్తారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు చాలా బలంగా ఉంటారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. శుక్రుడి వల్ల విలాసవంతమైన జీవితం గడుపుతారు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి అన్ని కోరికలు సిద్ధిస్తాయి.












Click it and Unblock the Notifications