Astrology: దరిద్రం పోయి ధనవంతులు కావాలంటే బుధవారం చెయ్యాల్సిన పనులివే!!
చాలామంది ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత డబ్బు సంపాదించినా, సంపాదించిన డబ్బు నిల్వ కపోగా, దరిద్రం వచ్చి పడుతుంది. అయితే అలా దరిద్రంతో బాధపడుతున్నవారు బుధవారం రోజు ఈ పని చేస్తే దరిద్రం తొలగి పోయి ధనవంతులు అవుతారు అని చెబుతున్నారు. అసలు బుధవారం రోజు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ ధర్మం ప్రకారం ప్రతి రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయించి మరీ పూజలు చేస్తారు. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం గణపతికి, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్య భగవానుడు కి పూజలు చేస్తారు. అయితే బుధవారం రోజు గణపతి పూజ చేయడం వల్ల కొంతమేర ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు అని చెబుతున్నారు.

వాస్తు దోషాలు వల్ల కొన్నిసార్లు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక ఇటువంటి సమయంలో ఇంటి వెలుపల ఇంటిలోపల గణపతి విగ్రహాలను పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగి పోతాయి. ఆ గణపతి విగ్రహాలను రెండింటినీ ఒక దానికొకటి వెనకభాగం కలిసి ఉండేలా ముఖ ద్వారం దగ్గర ఏర్పాటు చేస్తే వాస్తు దోషాలు తొలగిపోయి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి బుధవారం రోజున 21 లేదా 42 జాపత్రి ఆకులతో గణపతికి పూజ చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, డబ్బు వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డి మేతగా వేయడం వల్ల జాతకంలోని దోషాలు నశించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. అనుకున్న పనుల్లో పురోగతి సాధించి, ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అని చెబుతున్నారు.
ఆర్థిక సమస్యల వల్ల చాలా అప్పులు చేసి తిరిగి చేసిన అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారు బుధవారం రోజున పెసలను ఉడికించి అందులో కాస్త పంచదార, నెయ్యి వేసి ఆవులకు తినిపిస్తే మంచి జరుగుతుందని, ఇలా క్రమం తప్పకుండా ఐదు నుండి ఏడు వారాల పాటు చేయడం వల్ల అప్పుల నుండి విముక్తి లభిస్తుందని, ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనవంతులు అవుతారు అని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications