వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: శుక్రవారం నాడు మహిళలు అస్సలు చెయ్యకూడని పనులివే!!

|
Google Oneindia TeluguNews

అన్ని వారాల లోనూ శుక్రవారానికి మహిళలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆరోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మహిళలు ప్రయత్నిస్తారు. ఆమెకు ఇష్టం లేని పనులు ఏమీ చేయకుండా ఉండాలని భావిస్తారు.

vastu tips: ఈ పనులు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం; ఊహించని లక్ష్మీ కటాక్షం!!vastu tips: ఈ పనులు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం; ఊహించని లక్ష్మీ కటాక్షం!!

శుక్రవారం ఇంటికి వస్తువులు తెచ్చుకోవాలి కానీ బయటకు ఇవ్వకూడదు.. ఎందుకంటే

శుక్రవారం ఇంటికి వస్తువులు తెచ్చుకోవాలి కానీ బయటకు ఇవ్వకూడదు.. ఎందుకంటే


జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారానికి శుక్రుడు అధిపతి కావడంతో, శుక్రుడికి ఇష్టమైన పనులు చేయడం కూడా మంచిదని సూచించబడింది. శుక్ర గ్రహం అభివృద్ధిని కాంక్షించే గ్రహం కావడంతో, ఆయనను పూజించడం, లేదా ఇంట్లోకి ఏదైనా వస్తువులు తెచ్చుకోవడం మంచిదని చెబుతారు. ఇవ్వడం, పడేయడం రెండూ శుక్రుడికి నచ్చని అంశాలని చెబుతారు. ఇవ్వడం, పడేయడం చేస్తే మన సంపద కూడా అదేవిధంగా పోతుందని, ఇంటికి తెచ్చుకోవడం చేస్తే మన సంపద కూడా అదేవిధంగా వస్తుందని, అభివృద్ధి చెందుతుందని చెబుతారు.

శుక్రవారం రోజు మహిళలు ముఖ్యంగా చెయ్యకూడని పనులివే

శుక్రవారం రోజు మహిళలు ముఖ్యంగా చెయ్యకూడని పనులివే


ఇక శుక్రవారం రోజు మహిళలు ముఖ్యంగా చెయ్యకూడని అనేక పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. శుక్రవారం నాడు మహిళలు ఎవరూ ఇళ్లలో బూజు దులుపు రాదు. శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసి, బూజులు దులుపు కుంటూ పనులు చేస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి, ఆమె ఇంటిని విడిచి వెళ్లి పోతుంది అని చెబుతారు. అంతేకాదు శుక్రవారం నాడు పూజామందిరాన్ని శుభ్రం చేసి, శుభ్రం చేయగా వచ్చిన వాటిని బయట పడెయ్యకూడదు. శుక్రవారం నాడు పాత సామాన్లను, పాత బట్టలను ఎవరికీ దానమివ్వకూడదు. ఎవరికైనా వస్తువులు, బట్టలు దానం చెయ్యొచ్చు కానీ అది శుక్రవారం నాడు చెయ్యకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో సంపద వెళ్ళిపోతుందని చెప్తారు.

శుక్రవారం లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు చెయ్యకండి

శుక్రవారం లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు చెయ్యకండి


అంతేకాదు శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. పసుపు, కుంకుమలను కింద పడకూడదు. ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమలు డబ్బాలలో నిండుకుండలా చేయకూడదు. శుక్రవారం నాడు పువ్వులు క్రింద పడెయ్యకూడదు. దేవుడి మందిరాలలో ఎండిపోయిన పువ్వులను కానీ, ఇంటి గుమ్మాలకు, దర్వాజా లకు పెట్టిన పువ్వులను కానీ శుక్రవారం నాడు తీసిపారేయకండి. లక్ష్మీప్రదమైన రోజు కావడంతో ఆరోజు లక్ష్మీదేవికి ఇష్టం లేనివి ఏం చేసినా పేదరికం వస్తుందని చెబుతున్నారు.

 శుక్రవారం తలస్నానం చెయ్యొచ్చా ..

శుక్రవారం తలస్నానం చెయ్యొచ్చా ..


శుక్రవారం తల స్నానం కూడా చేయకూడదని అంటున్నారు. శుక్రవారం తలస్నానం చేస్తే మన సంపద కూడా హరించుకుపోతుందని అంటున్నారు. తలస్నానం ఎప్పుడూ బుధ, శనివారాలలో చెయ్యాలని చెబుతున్నారు. శుక్రవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుందని కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. ఇక ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో శుక్రవారం నాడు అత్తవారింటికి వారిని పంపకూడదు.

 శుక్రవారం ఈ విషయాల్లో జాగ్రత్త..

శుక్రవారం ఈ విషయాల్లో జాగ్రత్త..


అంతేకాదు శుక్రవారం నాడు మహిళలు ఎప్పుడూ కంటతడి పెట్టవద్దని, కుటుంబ సభ్యులను తిట్ట వద్దని సూచిస్తున్నారు. శుక్రవారం నాడు తినే అన్నాన్ని పక్కకునెట్టి కూడదని, వెలుగుతున్న దీపాన్ని ఆర్పి వేయకూడదని సూచిస్తున్నారు. శుక్రవారంనాడు తోడబుట్టిన వారి మనసు నష్టపెట్ట కూడదని, ఉదయం, సాయంత్రాలు నిద్రపో కూడదని చెబుతున్నారు. శుక్రవారంనాడు మహిళలు అబద్ధాలు చెప్పకూడదని సూచిస్తున్నారు. శుక్రవారం నాడు ఇంట్లోని ముఖ్యమైన ఆహార పదార్థమైన బియ్యాన్ని ఖాళీ చెయ్యకూడదు. ఉప్పు, పసుపు ఎవరికీ అరువు ఇవ్వకూడదని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that on Friday, women should not do dusting, donating things, clothes, emptying turmeric, saffron, rice and salt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X