వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పితృశాపం వల్ల కలిగే చెడు ఫలితాలు ఏమిటి?

పితృశాపంతో బాధపడేవారికి ఏ ఏ సమస్యలు వస్తాయో పైన వివరించటం జరిగింది. అయితే పితృశాపం ఉన్నవారికి, వారిని ఆ శాపానికి గురిచేసిన ప్రేతాత్మలు తరచుగా కలలల్లోకి వసూ ఉంటాయి.

|
Google Oneindia TeluguNews

1. పితృశాపము ఉన్నవారికి సంతానము కలగదు. ఒకవేళ కలిగినా సంతానము చిన్నతనములోనే నశించిపోతుంది.

2. పితృశాపం అనుభవిస్తున్నవారిపై పిశాచపీడ, దుష్టగ్రహపీడ అధికంగా ఉంటుంది. వీళ్ళకి విపరీతంగా చెడు ధృష్టి తగులుతుంది. అంతేకాకుండా వీరిపై వీరి శత్రువులు చేతబడులు అనేకసార్లు చేయించటం జరుగుతుంది.

3. పితృశాపం ఉన్నవారికి అతి తొందరగా షుగర్, ఊబకాయం, ఆస్తమా లాంటి నివారణ (Cure)లేని వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా వీరి పిల్లల్నికూడా ఎప్పుడూ ఏదోఒక అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది. చూసేవారికి వీళ్ళ ఇల్లు ఒక మెడికల్షాప్లాగా, హాస్పటల్లాగా కనిపిస్తుంది.

4. పితృశాపము ఉన్నవారికి తరచుగా యాక్సిడెంట్ల జరగటం, హాస్పటల్ పాలవటం జరుగుతుంది.
5. గృహంలోని సభ్యులు అకాలమృత్యువు పాలుకావటం లేదా ఆత్మహత్య చేసుకోవటం, నీటిలో మునిగి చనిపోవటం లేదా ప్రమాదంలో చనిపోవటం లాంటివి జరుగుతాయి.

నోటి ద్ధి గత రెండు జన్మలలో పితృఋణము తీర్చకుండా ఉండటమే కాకుండా తల్లి లేదా తండ్రిని అన్నంపెట్టకుండా బాధించి మరియు హింసించిన వారికి మూడవ జన్మలో అతిభయంకరమైన కష్టాలు రావటం జరుగుతుంది. అయితే గత జన్మలలో వేరే విధమైన పుణ్యకార్యాలు చేసిన కారణంగా వీళ్ళకి అపారంగా డబ్బు, పరపతి, పదవులు లభిస్తాయి. అంతమాత్రాన వీళ్ళు సుఖపడతారని భావించకూడదు.

వీళ్ళు సంపాదించే ఆస్తిని అనుభవించాల్సిన వాళ్ళు (వారసులు) అకాలమృత్యువు పాలయి వీళ్ళకు పైకి చెప్పకోలేని దుఃఖాన్ని ఆక్రోశాన్ని కలిగిస్తారు. కారణం గత రెండు జన్మల తాలూకు పితృశాపం వీరిని నానా రకాలుగా హింసిస్తున్నది అని గ్రహించాలి.

పైన పేర్కొన్న బాధాకరమైన సమస్యలను నివారించుకొనుటకోసం పితృశాప పరిహారాన్ని చేయించుకోవాలి. ఈ పితృశాప పరిహారంకోసం మంత్రశాస్రాలలో ఒక గొప్ప పరిహార ప్రక్రియ చెప్పబడియున్నది. దానినే 'నారాయణ నాగబలి" అని పిలుస్తారు.

రెండవ రకం పితృశాపం కొంతమంది మానవులు ఈ క్రింది పరిసితులలో అకాలమృత్యువు పాలు కావటం జరుగుతుంది. అలాంటి వారికి తగిన శ్రార్ధకర్మలు చేసే వారసులులేక, ఆ చనిపోయినవారు ప్రేతాత్మలు (Ghosts)గా మారి తమ కుటుంబంలోని వారిని వీలైనన్ని విధాలుగా బాధించటం జరుగుతుంది. అలా ఆత్మశాంతి లేకుండా ప్రేత రూపంతో సంచరించే కుటుంబీకుల ఆత్మఫరోష పితృశాపంగా మారి బ్రతికిఉన్నవారికి తగిలి బాధించటం జరుగుతుంది.
పితృశాపం ఎవరికి తగులుతుంది?

ఎ) వివాహానికి పూర్వమే తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

బి) నీటిలో మునిగి తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా ఫ్రీ మరణించటం,

సి) ప్రమాదకరమైన జంతువులచేతకానీ, విషపూరితమైన సర్పాలచేతకానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

డి) కాల్చుకునికానీ, విద్యుత్ షాక్ చేతకానీ, విషం తాగి కానీ, ఉరివేసుకునికానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా ఫ్రీ మరణించటం.

ఇ) ఆహారంతినేటప్పడు లేదా పానీయంతాగేటపుడు అది గొంతుకు అడ్డంపడి తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

ఎఫ్) విపరీతంగా తినటంవలనగానీ లేదా మద్యాన్ని సేవించటం వలనకానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా ఫ్రీ మరణించటం.

జి) విదేశాలలో లేదా దూరప్రాంతాలలో దిక్కులేకుండా తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

Bad effects with Pithru Shapam

హెచ్) దక్షిణాయణంలోకానీ, "పంచక కాలంలోకానీ, అతిదుష్ట నక్షత్ర మరియు తిధి కలిసిఉన్న కాలంలోకానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

పై కారణాలవలన చనిపోయిన ఫ్రీ పురుషులకు మరణానంతర కర్మకాండలు చేయించేవాళ్ళు ఉండరు. చిన్నవయసులో ఇలా వివిధ కారణాల వలన దుర్మరణం పాలయిన వ్యక్తులయొక్క ఆత్మలు, ప్రేతాత్మలుగా మూరి తమ కుటుంబీకులను పీడిస్తాయని గరుడపురాణం తెలియజేస్తుంది. తమకు పితృశాపం ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి?

పితృశాపంతో బాధపడేవారికి ఏ ఏ సమస్యలు వస్తాయో పైన వివరించటం జరిగింది. అయితే పితృశాపం ఉన్నవారికి, వారిని ఆ శాపానికి గురిచేసిన ప్రేతాత్మలు తరచుగా కలలల్లోకి వసూ ఉంటాయి. ఒక్కోసారి పితృశాపం ఉన్నవారికి నేరుగా ప్రేతాత్మలు కనపడకుండా పితృశాపానికి చిహ్నంగా కొన్ని ప్రత్యేక ప్రతీకలు (Symbol)స్వప్నాలలో కనిపిస్తాయి.

1. కలలో ఒక త్రాచుపాము పడగవిప్పి కనిపించటంకానీ, ముకులు ముక్కలై కనిపించటంకానీ లేదా ఆ కలకంటున్నవ్యక్తికి తాను కలలో త్రాచుపామును చంపుతున్నట్లుగా కనిపించటంకానీ జరిగితే అతనికి పితృశాపం ఉన్నట్టే

2. మహాసముద్రంకానీ, పెద్ద నదికానీ, పెద్దసరస్సుకానీ అనేక సార్లు కలలలో కనిపిస్తున్నచో అతనికి పితృశాపం ఉన్నట్టే

3. తాను నీటిలో మునిగి పోతున్నట్టకానీ లేదా నీటిలోనుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్టుకానీ అనేకసార్లు కలలు వచ్చినా అతనికి పితృశాపం ఉన్నట్టే.

4. తాను ఇతరులతో తగాదాలు పడుతున్నట్లు, కొట్లాటలు చేస్తున్నట్టుగా అనేకసార్లు కలలు వస్తున్నట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే

5. ఒక మహాభవనం పడగగొట్టబడుతున్నట్టుగా కలలో కనిపిచినట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే

6. ఇటీవలి కాలంలో భర్తను పోగొట్టుకున్న ఫ్రీ లేదా చనిపోయిన ఫ్రీ కలలో కనిపించినట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే (ఇలా కలలోకనిపించే స్త్రీ రక్తబంధువు అయిఉండాలి)

7. ఎవరోఒక ఫ్రీ పెద్దగా రోదిస్తూ భుజంపై చనిపోయిన తనబిడ్డను వేసుకుని ఎటో నడుచుకుంటూ వెళుతున్నట్టుగా కలవచ్చినా అతనికి పితృశాపం ఉన్నట్టే

అలాంటి స్వప్నాలు వచ్చేవారికి ఖచ్చితంగా పితృశాపం ఉండితీరుతుంది. అలాగే ఆ పితృశాపం వల్ల కలిగే దుష్ఫలితాలలో కనీసం ఒకటైనా వారికి కనిపిసుంది.

పైన పేర్కొన్న రెండు రకాల ప్రేతాత్మలయొక్క పీడలను "పితృశాపం" అని పిలుస్తారు. ఈ పితృశాప నివారణకు పరిహార శాస్రాలలో మంచి అనుభవము, పాండిత్యముగల ఒక పండితునిచేత నారాయణనాగబలి ప్రక్రియను జరిపించుకొన్నచో ఏరకమైన పితృశాపమైననూ తొలగిపోయి అప్పటిదాకా ఆ శాపంతో బాధపడుతున్న వ్యక్తులు ఆపై కోరినవిపొంది సుఖజీవనాన్ని గడపగలరు.

English summary
Astrologer explained bad effects of Pitru Sapam and its remedies in his article.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X