ఈ రాశివారు ఈ 4 నెలల సమయంలో జాగ్రత్త?
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు, శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి 8వ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత తొమ్మిదో స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు.

ప్రథమార్థం అనుకూలంగా ఉండదు
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు, శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దూరప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అదనపు బాధ్యతలు కూడా ఉండటంతో క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. దీనివల్ల మానసిక ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటంతో మీరు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

కేతువు గోచార మూడో ఇంటిలో..
ఈ సమయంలో కేతువు గోచారం మూడో ఇంటిలో అనుకూలంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు నిరాశకు లోనయినప్పటికీ, మీ సహోద్యోగులు, మిత్రుల సహకారంతో ఉత్సాహాన్ని తిరిగి పొందగలుగుతారు. ఏప్రిల్ చివరి వారంలో గురు గోచారం 9వ ఇంటికి మారటంతో వృత్తి పరంగా మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయి. తిరిగి మీ సొంత ప్రాంతానికి రావడంవల్ల మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. గతంలో మీకు ఇచ్చిన పనులను నిజాయితీగా పూర్తిచేయడంవల్ల మే నుంచి నవంబరు మధ్యలో అనుకూల ఫలితం లభిస్తోంది. గురువు దృష్టి ఒకటో స్థానంపై ఉండటంవల్ల ఏప్రిల్ నుంచి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల వృత్తిలో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న పై అదికారులు ఇప్పుడు మెచ్చుకుంటారు.

కార్యాలయ అభివృద్ధికి ఉపయోగపడే మీ సలహాలు
మీరిచ్చే సలహాలు, మీ ఆలోచనలు మీ కార్యాలయ అభివృద్ధికి సహకరించడంవల్ల మీ మృత్తిలో పదోన్నతితోపాటు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. రహస్య శత్రువులు కారణంగా కానీ, లేదంటే గతంలో చేసిన తప్పుల గురించి మీ పై అధికారులకు తెలియడం వల్ల కాని మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. గురు గోచారం వల్ల ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సమయం ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలం, జులై 17 నుంచి ఆగస్టు 17 మధ్యకాలం మరియు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యకాలం వృత్తిలో ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. అటువంటి సమయంలో చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావు












Click it and Unblock the Notifications