బుధాదిత్య రాజయోగంతో ఈరాశులవారికి బంగారమే!

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడు తాజాగా తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈనెల 14వ తేదీన సూర్యభగవానుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేష రాశిలో బుధుడు, సూర్యుడి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఈ పవిత్రమైన యోగం కారణంగా 5 రాశులవారి జాతకాలు మారిపోతున్నాయి. ఏ రాశివారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

ధనస్సు రాశి: ధనస్సు రాశి 5వ ఇంట్లోకి బుధుడు ప్రవేశిస్తాడు. దీనివల్ల కోరుకున్న ఉద్యోగం సొంతమవుతుంది. ధనలాభం ఉంది. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవడమే కాకుండా ఆదాయం కూడా రెట్టింపవుతుంది. విద్యార్థులు తమ విద్యలో మంచిగా రాణిస్తారు.

bhudhaditya rajayoga.. these zodiac signs are very lucky

కర్కాటక రాశి: బుధాదిత్య రాజయోగం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సమయానికి డబ్బులు అంది ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వస్తుంది.

మేష రాశి: మేషరాశి లగ్న గృహంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. వివాహమవనివారికి సంబంధాలు కుదురుతాయి. పోటీపరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు విజయం సాధించడమే కాకుండా తమ వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుచుకుంటారు.

మిథున రాశి: ఈ రాశి 11వ ఇంట్లోకి బుధుడు ప్రవేశించడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించడమే కాకుండా డబ్బును పొదుపు చేస్తారు. కోరికలన్నీ నెరవేరతాయి. భూమి లేదంటే ఇతర ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం పుష్కలంగా ఉంది.

సింహ రాశి: సింహరాశి అదృష్ట స్థానంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. వీరు చేపట్టే ప్రతి పనిలోను అదృష్టం కలిసివస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కడమే కాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వీరి ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభం చేకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+