ఇంట్లో నైరుతి దోషం ఉందేమో ఒకసారి చూడండి
ఇంటి నిర్మాణంలోకానీ, కార్యాలయ నిర్మాణంలోకానీ.. ఇలా ఏ కట్టడాన్ని నిర్మించాలన్నా వాస్తును చూడటం అనేది ప్రధానం. అది మాన భారతీయ పురాతన శాస్త్రం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాస్తును అనుసరిస్తారు. వాస్తులో లోపాలుంటే కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. జీవితంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను వాస్తును అనుసరించడంద్వారా పరిష్కరించుకోవచ్చు.
అయితే దిక్కుల ప్రకారం ఇల్లు సరిగా ఉండాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి అని మొత్తం ఎనిమిది దిక్కులుంటాయి. ఇందులో ఏ ఒక్క దిక్కు వాస్తు ప్రకారం లేకపోయినా ఇబ్బందులు తప్పవని, అందుకే ఎంతో జాగ్రత్తగా ఇంటిని నిర్మించాలని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. నైరుతికి సంబంధించి ఏవైనా దోషాలుంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.

నైరుతి మూలను ఇంటి ప్రధాన ద్వారం కూడా ఉపయోగించకూడదు.
దీనివల్ల ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి.
ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
నైరుతిలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే అది నష్టాన్ని కలిగిస్తుంది.
ఈశాన్యంలో బహిరంగ స్థలం ఉంటే మంచిది.
దీనివల్ల ఎటువంటి దోషాలు అంటవు.
అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నైరుతి మూలలో ఉండాలి.
దీనివల్ల ఇంటి చుట్టూ శక్తి సమాంతరంగా ఉంటుంది.
ఎగువ నీటి ట్యాంక్ నైరుతి వైపు ఉండాలి.
నైరుతి మూలలో ఉండే మరుగుదొడ్ల తలుపులను ఎప్పుడూ మూసే ఉంచాలి.
దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాదు.
నైరుతి మూలలో సోఫాలు, అల్మారాల్లాంటి బరువైన వస్తువులు ఉండాలి.
దీనివల్ల కూడా ప్రతికూల శక్తి చేరదు.
నైరుతి మూలలో ఇంటిని విస్తరించకూడదు.
నైరుతిలో అదనపు స్థలం అనేది ప్రతికూల శక్తిని పెంచుతుంది.
లోపాన్ని సరిచేయడానికి చెక్క, ఇత్తడి, రాగి వంటి నిర్మాణాలు వాడాలి.
నైరుతిలో బోర్‌వెల్ వేయకూడదు.
ఎరుపు రంగు వేసి దానిపై రాహువు యంత్రాన్ని ఉంచి బోర్ వేయొచ్చు.
నైరుతిలోని స్థలంలో ఉన్న ఫ్లోర్ పై ఎరుపు రంగులో టైల్స్ కానీ, కార్పెట్ కానీ వేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications