500 ఏళ్ల తర్వాత రాజయోగం.. ఈ రాశులకు మహాయోగం
దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. శని వల్ల రాజయోగం ఏర్పడటంతో జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ ఏడాది దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీనికి అదనంగా సూర్యుడు, చంద్రుడు తులారాశిలో ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల విశేష రాజయోగం ఏర్పడుతోంది. ఈ పండుగ సందర్భంగా ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడగా, నవంబర్ 16, 17 తేదీల్లో రుచక్, యుక్త యోగాలు ఏర్పడనున్నాయి. దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఇలాంటి రాజయోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం మొత్తం అన్ని రాశులపై ఉన్నప్పటికీ 4 రాశులవారి జీవితాలను ప్రత్యేకంగా ప్రభావితం చేయనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
ధనస్సు రాశి : అదృష్టం తోడుంటుంది. ఆర్థికస్థితి పటిష్టమవుతుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే భారీ రాబడిని పొందడానికి ఇది మంచి సమయం. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు పొందుతారు.

మకర రాశి: వీరి జీవితంలో దీపావళి వెలుగులు నింపుతుంది. ప్రేమ జీవితంతోపాటు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం బలోపేతమవుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
మేషరాశి : జీవితం ఆనందాన్ని కలిగిస్తుంది. బృహస్పతి మేషరాశిలో ఉండటంతో అన్నివిధాలుగా విజయం సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
వృషభ రాశి : భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇల్లు, ఆస్తి, వాహనం తదితరాలను కొనుగోలు చేయాలనుకునే మీ కల ఇప్పుడు నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులు తమ పనితీరుపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.












Click it and Unblock the Notifications