వాస్తు ప్రకారం మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి?
ఇంటి నిర్మాణాన్ని వాస్తు ప్రకారం నిర్మించడంతో పని పూర్తవదు. ఇంట్లో ఉండే గదులతోపాటు వస్తువులకు కూడా వాస్తు వర్తిస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది వాస్తు నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే అవి ఉండాలి. అలా కాకుండా వాస్తుకు విరుద్ధంగా ఉంటే కొన్ని ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇంట్లో కుటంబ సభ్యులంతా భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ ఉంటుంది. అయితే దానికి కూడా వాస్తు ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.
భోజనం చేసే బల్ల, కుర్చీలు వంటగదికి దగ్గరలో ఉండాలి.
వాస్తు ప్రకారం దక్షిణంలో మధ్యలో, పడమరలో మధ్యలో ఉండాలి.
అందరూ కలిసి భోజనం చేయడంవల్ల కుటుంబ సభ్యుల మధ్య
ఐకమత్యాన్ని పెంచుతుంది.. ఆరోగ్యాన్నిస్తుంది.. సానుకూల వాతావరణం కలుగుతుంది.

పశ్చిమ దిశలో భోజనం చేసే బల్ల ఉంటే చాలా మంచిది.
అది కుదరనప్పుడు తూర్పున లేదంటే దక్షిణాన ఏర్పాటు చేసుకోవాలి.
నైరుతి మూలలో ఎప్పుడూ ఉండకూడదు.
ఇలా ఉంటే అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
భోజనం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చోవాలి.
అది కుదరనప్పుడు ఉత్తరం లేదంటూ పడమర ఉండాలి.
దక్షిణం వైపు కూర్చొని భోజనం చేయకూడదు.
భోజనం చేసే బల్లలు దీర్ఘచతురస్రాకారంగా, చతురస్రాకారంగా ఉండాలి.
ఇవి ఇంటికి స్థిరత్వాన్ని కల్పిస్తాయి.
కొన్ని బల్లలు చూడటానికి బాగున్నాయని ఏవి పడితే అవి తెస్తుంటారు. అలాంటివి వద్దు.
భోజనం బల్లకు పక్కన అద్దం ఉంటే మంచిది.
అద్దంలో బల్ల కనపడితే ఆహారం రెట్టింపు అవుతున్నట్లు కనపడుతుంది.
సంపద పెరుగుతుంది.
చీకటిలో, మసక వెలుతురులో భోజనం చేయకూడదు.
దీనివల్ల ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
భోజనం చేసే బల్లమీద పనికిరాని వస్తువులు, పాత పేపర్లు ఉండకూడదు.












Click it and Unblock the Notifications