దీపావళి నాడు ఈ 5వస్తువులను ఇంటికి తెచ్చుకోండి; సంపద వర్షం!!
దీపావళి పండుగ.. ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి పండుగను నవంబర్ 12వ తేదీన జరుపుకోనున్నారు. హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ముఖ్యమైనది. దీపావళి పండుగ అన్ని పండుగలలోనూ పెద్ద పండుగగా పరిగణించబడుతుంది. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని, గణపతిని విశేషంగా పూజిస్తారు.
దీపావళి పండుగకు ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపావళి పండుగ నాటి లక్ష్మీ పూజకు సిద్ధం చేసుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం నుండి రాముడు తిరిగి వచ్చినందుకు దీపావళి పండుగ జరుపుకుంటారని ఒక కథ ప్రచారంలో ఉంది. అలాగే నరకాసురుని సంహరించి, నరకాసురుడు మరణించిన తర్వాత దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.

అటువంటి దీపావళి పండుగ నాడు జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని పూజించడం జీవితాంతం సిరిసంపదలకు లోటు లేకుండా చేస్తుందని చెబుతున్నారు. దీపావళి పండుగ రోజు కొన్ని వస్తువులను తీసుకొని రావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అని ఆ వస్తువుల వల్ల ఇంటికి సంపద మరియు శ్రేయస్సు వస్తుందని చెబుతున్నారు.
దీపావళి పండుగ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. అయితే దీపావళి పండుగ రోజున ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంటికి ఎర్రని బట్టలు తెచ్చుకుంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు దీపావళి రోజున అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుందని అంటున్నారు.
దీపావళి నాడు ఇంట్లో శ్రీ యంత్రాలను కొనుగోలు చేయడం, అలాగే శ్రీ యంత్రాలను ఇంట్లో పెట్టడం రెండూ శ్రేయస్సును ఇస్తాయని అంతేకాదు దీపావళికి గోమతి చక్రాన్ని కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. ఇది కుటుంబాన్ని సుసంపన్నం చేస్తుందని చెబుతున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications