ఫిబ్రవరి 2న వసంత పంచమి... ఈ ఒక్క పని చేయండి.. కోటీశ్వరులవుతారు
చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులైనవారే డబ్బును సంపాదించుకుంటారు. అలా అని విద్యావంతులవనివారు డబ్బులు సంపాదించడంలేదనికాదు.. మొదటి నుంచి మన పురాణాలు ఈ మాటను చెబుతున్నాయి. తల్లి సరస్వతిదేవి జన్మదినోత్సవాన్నే వసంత పంచమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది మాఘమాసం శుక్ల షష్టి తిథిరోజు పంచమి వచ్చింది. రెండోతేదీ ఉదయం ఏడు గంటల తర్వాత రావడంతో ఆరోజే వసంత పంచమి జరుపుకుంటారు. మూడోతేదీ ఉదయం వరకు తిథి ఉంది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో నాలుగో అమృత స్నానం వసంత పంచమిరోజు చేస్తారు.
మొక్కలను కొట్టేయకూడదు
వసంత పంచమి రోజు పసుపు రంగు దుస్తులు ధరించి, అమ్మవారికి పసుపు రంగు పండ్లు, పూలు, దుస్తులు సరస్వతీదేవికి పెట్టి పూజిస్తారు. ఆరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి పసుపురంగు దుస్తుల్లో సరస్వతీదేవిని ఆరాధించాలి. పుస్తకాలు, పెన్నులు తల్లి ముందు పెట్టి పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఆరోజు మొక్కలను కొట్టేయకూడదు. ఎందుకంటే వసంతకాలం మొదలయ్యేది ఆరోజే. చెట్లు, మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. వీలైతే ఉపవాసం ఉంటే మంచిది. సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలే వస్తాయి.

ఊహించని రీతిలో ప్రయోజనాలు
ఆరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. జ్ఞానంతో పాటు తెలివితేటలను పొందుతారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులు దానం చేయాలి. దీనివల్ల జీవితంలో డబ్బు, సంతోషానికి లోటుండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. గతంలో ఉండే సంపాదనకన్నా ఇంకా పెరుగుతుంది. పురాణాల్లో సరస్వతిని అన్నపూర్ణగా అభివర్ణించారు. ఆమె అనుగ్రహం కావాలనుకునేవారు అన్నదానం చేస్తే మంచిది. సరస్వతికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులు, వస్తువులను పేదలకు దానం చేయడంవల్ల మంచి లాభాలను పొందుతారు. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు.












Click it and Unblock the Notifications